సెటిల్‌మెంట్‌లు, కబ్జాలు.. కాదంటే బెదిరింపులు.. తిరగబడితే ఏకంగా ప్రాణాలకే ముప్పు.. ఇలా సాగుతుంది ఏపీ అధికార పాలన. ఇది నిజమనడానికి ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఒకటి తాజాగా బయటపడింది. వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామానికి చెందిన శివరామకృష్ణయ్యకు 5 లక్షలు విలువచేసే స్థలం ఉంది. దానిపై అతని కుటుంబంలో గొడవలు చెలరేగాయి. పంచాయితి కాస్త పోలీస్ స్టేషన్ కి చేరడంతో.. డబ్బలు ఇవ్వడానికి ఒప్పుకుంది శివరామకృష్ణయ్య కోడలు.
అప్పుడేమో ఒప్పుకుని.. తర్వాత ఆ డబ్బులను ఎగొట్టడానికి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు కోడలు గారు. ఇంకేముంది శివరామకృష్ణయ్యకు బెదిరింపులు మొదలయ్యాయి. స్థలం తాలుకూ విషయం మాట్లాడాలని పిలిపించిన ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వకుండా.. స్థలం పేపర్లపై సంతకాలు పెట్టించుకోవడంతో మనస్థాపం చెందిన శివరామకృష్ణయ్య సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది.
అధికార నేతల బెదిరింపులకు అంతుపంతు లేకుండా పోతుంది. ఇటీవలి కాలంలో ఇలాగే దంపతుల మధ్య గొడవల్లో వైసీపీ నేత తలదూర్చి భర్తను బెదిరించడంతో.. అతను పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా వైసీపీ నాయకులు తమ అధికార గర్వాన్ని చూపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Also Read: వైసీపీ సర్కారు దగా.. పంటల బీమాలో పచ్చి మోసం!











