సినిమా రంగంలో కోవిడ్ ఎవరినీ వదలడం లేదు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా పాజిటివ్ కు గురయ్యారు. అల్లు అర్జున్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు లియో న్యూస్ నాలుగు రోజుల క్రితమే రాసింది. ఈ మధ్యనే ఆయన డ్రైవర్ కోవిడ్ తో మృతిచెందడంతో ఆయన ఐసోలేషన్ లో ఉంటున్నారు. తనకు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నా. వైద్యుల పర్యవేక్షణలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నా.
ఈ మధ్య నన్ను కలిసిన వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఆయన మేకప్ మన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దాంతో ప్రభాస్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. సినీ పరిశ్రమలో చాలా మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.
Must Read ;- నువ్వు హీరోనా.. నేను కరోనా.. కాస్కో!