మా భూములు తాకట్టుపెట్టి టౌన్ షిప్ కడతారా?
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు పైగా సాగుభూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. రెండేళ్లుగా మూడు రాజధానుల పేరుతో భూమిలిచ్చిన రైతులను పిచ్చివాళ్లను చేసి, నిర్దయగా రోడ్డుపై నిలబెట్టారు జగన్ రెడ్డి! రాజధానిలో ఎటువంటి అభివృద్థి పనులు చేపట్టకపోగా.. ఉన్న భూములను తాకట్టుపెడుతున్నారు! తాజాగా అమరావతిలో 407 ఎకరాల భూములను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాకట్టు ద్వారా పొందిన రుణంతో అమరావతి పరిధిలోని నవులూరు వద్ద జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో భాగంగా సీఆర్డీఏ లే అవుట్ వేస్తోంది! గతంలో అమరావతి టౌన్ షిప్ కోసం రైతుల నుంచి వీజీటీఎం – ఉడా సేకరించిన భూమిలో కొంత అమ్మేయగా, మిగిలిన దాంట్లో లేఅవుట్ వేస్తున్నట్లు ప్రకటించింది. దీని నిర్మాణానికి 407 ఎకరాల భూమిని హడ్కోకు తాకట్టు పెట్టడంపై రైతులు భగ్గుమంటున్నారు. రాజధానిగా అమరావతి వద్దంటున్న ప్రభుత్వ పెద్దలు.. ఇక్కడి భూముల్ని ఎలా తాకట్టు పెడతారని ప్రశ్నిస్తున్నారు. భూములను తనఖా పెట్టి, ఆ సొమ్ముతో స్మార్ట్ టౌన్ షిప్ కట్టాలనుకోవడం దారుణమని మండిపడ్డారు.
ప్రైవేటు వెంచర్లుకు పోటీపడుతూ ప్రమోషన్!
ప్రైవేటు రియల్ ఏస్టేట్ సంస్థలకు తీసుపోనట్లుగా బ్రోచర్లు రూపొందించి, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రమోషన్ వర్క్ ను ప్రారంభించింది జగన్ రెడ్డిప్రభుత్వం! చదరపు గజం 17 వేల 500 రూపాయాల చొప్పున స్థలాలను అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇతర ప్రైవేటు లేఅవుట్లలో ఉన్న ధర కంటే ఇది ఎక్కువే. మరోవైపు లేఅవుట్ అభివృద్థికి సీఆర్డీఏ శంకుస్థాపన కూడా చేసింది. అయితే గతంలో హడ్కో లో 145.59 ఎకరాల భూమిని తనఖా పెట్టారు. తనఖా ద్వారా 12 వందల 75 కోట్ల రుణమిచ్చింది. ఈ భూమిని హడ్కో నుంచి విడిపించుకుని స్మార్ట్ టౌన్ షిప్ అభివృద్థి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే రాజధాని పరిధిలోని 407 ఎకరాల్ని తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది! మొత్తంగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పేరుతో చేస్తున్న రియల్ ఏస్టేట్ వ్యాపారానికి తమ భూములను తనఖా పెట్టడానికి తమ భూములే కావాలా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాకిచ్చిన ఉద్యోగులు..! ఇక ప్రభుత్వం పనైపోయినట్లే!!