మూడు రాజధానూలు, సి.ఆర్.డి.ఏ చట్టాలపై వెలువడిన హైకోర్టు తుది తీర్పు..
సి.ఆర్.డి.ఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుచుకోవాలి..
అమరావతి రాజధానిగా ఉన్నది ఉన్నట్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఆదేశం..
జగన్ ప్రభుత్వానికి మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానూలు, సి.ఆర్.డి.ఏ చట్టాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం సి.ఆర్.డి.ఏ చట్టం ప్రకారమే వ్యవహరించాలని కోర్టు తెలిపింది. ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేసి ఒప్పందం ప్రకారం అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని కోర్టు తీర్పు నిచ్చింది.భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరిచిన ప్లాట్ లను అప్పగించాలని , పిటిషన్ ల ఖర్చు కింద రైతులకు 50 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని తెలిపింది. అదేసమయంలో అభివృద్ధి పనులు పై ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఇప్పటికే ఆయా చట్టాలపై విచారణ ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈరోజు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా,జస్టిస్ M. సత్యనారాయణ మూర్తి,జస్టిస్ DVSS సోమయాజులు నేతృత్వంలోని హిజ్ కోర్ట్ సిజే బెంచ్ తుది తీర్పు ఇచ్చింది.
Musat Read:-కొత్త జిల్లాల రాజకీయంలో మునిగేది జగన్ పార్టీనే!?











