సీబీఐ వాంగ్మూలంలో విస్తపోయే వాస్తవాలు?
వివేకా హత్యకేసును ఆయన కుమార్తె సునీత రెడ్డి ఒత్తిడి మేరకే జగన్ ప్రభుత్వం విచారణను సీబీఐకి అప్పగించింది. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగింది. ఈ కేసును అప్పటి వరకు విచారిస్తున్న సిట్ ను తప్పించి, సీబీఐకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి రెండు సార్లు, ఇంటి వాచ్మెన్ రంగన్న, కూతురు సునీత వాగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. వీరందరి వాంగ్మూలంలో కామన్ గా వినిపించే పేరు మాత్రం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్! సో తాజాగా సునీత వాంగ్మూలం కూడా బయటకొచ్చింది. ఈ వాంగ్మూలమే సోషల్ మీడియాతో పాటు ప్రధాన వార్తా సంస్థలన్నీ కవర్ చేశాయి. 2020, జులై 7న సీబీఐ అధికారులు డాక్టర్ వైయస్ సునీతా రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న జగన్ కోరాను.. అనుమానితుల పేర్లు కూడా ఆయనకు చెప్పానని సునీత తన వాంగ్మూలంలో వివరించారు. అయితే జగన్ .. వాళ్లందర్ని ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారని’’ సునీత తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. సీబీఐకి ఇస్తే ఏమవుతోంది.. అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతాడు .. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై పన్నెండు కేసులు అవుతాయ్ అని సీఎం జగన్ మాట్లాడారని సునీత తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కావాలనే సునీత తమను ఇరికిస్తున్నారు..
వివేకా హత్య కేసు విచారణ చివర దశకు చేరిందనే చెప్పాలి. సీబీఐ ఈ కేసును 2020 లోనే క్లోజ్ చేసి.. దోషులను జైలుకు పంపేందుకు అన్ని సాక్ష్యాలను సిద్ధం చేసింది. కొన్ని రాజకీయ ఒత్తుళ్లు, సిఫార్సుల మేరకు కేసు మూడేళ్లుగా సాగదీస్తు వస్తున్నారు. అయితే సీబీఐ దర్యాప్తుపై కూడా అనేక విమర్శలు, ఆరోపణలు రావడంతో ఇటీవలే కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే 2020 లో సీబీఐ తీసుకున్న వాంగ్మూలాలు నేడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కూతురు సునీతనే ప్రలోభాలకు గురిచేసిందని, మొత్తంగా వైసీపీ ఎంపీ అవినాష్, ఇతర నేతలను ఇరుకున పెడుతూ.. సీబీఐ వేసిన చార్జిషీటును సవాలు చేస్తూ న్యాయపోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించినట్లు అధికారపాట్టి జేబు పత్రికగా పిలువబడే ఓ దినపత్రిలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న గంగాధర్ రెడ్డి ఆరోపించిన విషయాలను ఆ పత్రికనే ప్రధానంగా ప్రచురించింది. అనంతపురం జిల్లా వేదికగా గంగాధర్ రెడ్డి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మరి సంచలన విషయాలు బయటపెట్టారు. వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో కుట్రపూరితంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. తాము చెప్పినట్లు సీబీఐకి చెబితే రూ. 50 లక్షల నగదు, కారు, తన కాలికి చికిత్స ఖర్చులు భరిస్తామంటూ వివేకా కుమార్తె సునీత, జగదీశ్వర్ రెడ్డి ప్రలోభపెట్టారని గంగాధర్ రెడ్డి వెల్లడించారు. ఇలా వివేకా హత్యకేసు మిస్టరీగా మిగిలిపోవాలని .. పలువురు దీంట్లో ఇన్వాల్ అయి, కేసును పలు మలుపులు తిప్పుతున్నారు. కానీ సీబీఐ మాత్రం వివేకా హత్య కేసులో సత్యానేషణ కోసం వేగంగా తన దర్యాప్తును పూర్తిచేసి, కేసులోని దోషులను పట్టుకోవాలని చూస్తున్నారు.
Must Read:-వివేక హత్యకేసులో సూత్రదారి అరెస్ట్‌కు అడుగుదూరం! సీబీఐ ఛార్జ్‌షీట్ చెబుతున్న వాస్తవాలు!











