రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, బీజేపీ పార్టీల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు కూడా విసురుకుంటున్నారు. దీంతో హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వరద సాయం విషయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాసారని, దీంతోనే బాధితులకు సాయం ఇవ్వకుండా నిలిపివేసారనే ఓ లేఖ వైరల్ అయ్యింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ తాను ఎలాంటి లేఖ రాయలేదని, ఈ లేఖపై బండి సంజయ్ ఇప్పటికే సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ వివాదం కాస్త సోషల్ మీడియాలో పెద్దది కావడంతో లేఖపై నిజాలు తేల్చుకుందామని ముంఖ్యమంత్రికి ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చార్మినార్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించేందుకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో చార్మినార్, నాంపల్లి ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఈ బైక్ ర్యాలీకి పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికి చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి కచ్చితంగా వస్తానని బండి సంజయ్ పేర్కొనడంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బండి సంజయ్‌ను ముందస్తు అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందులోనూ ఈ రోజు శుక్రవారం కావడం, మరోవైపు ఎన్నికలు కావడంతో చార్మినార్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఉంది. కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ రోజు చివరి రోజు కావడంతో అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో పార్టీలన్ని బిజీబిజీ గా ఉన్నాయి. తాజాగా బీజేపీ పార్టీ 56 మందితో నాల్గో జాబీతాను విడుదల చేసింది. 21 మందితో ఫస్ట్ లిస్టు, 18 మందితో సెకెండ్ లిస్ట్, 34 మందితో మూడో జాబితా, ఈ రోజు 56 మందితో నాల్గవ జాబితాను విడుదల చేసింది. మొత్తం ఇప్పటి వరకు 129 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ రోజే నామినేషన్ల ప్రక్రియకు చివరి రోజు కావడంతో ఎవరికివారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
Must Read ;- ఒకరు తుస్సుమన్నా.. ఇద్దరిలో ఇంకా ధీమానే!