ఏపీలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ చర్యలు చేపట్టినా.. అందరికీ వ్యాక్సిన్ అందకపోవడంతో కరోనా కేసుల పెరుగుదలకు దారి తీస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 58,835 శాంపిల్స్ పరీక్షించగా, 12,994 మంది కరోనా వచ్చినట్లు తేలింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఒక బులిటెన్ విడుదల చేసింది. ఒకరోజు వ్యవధిలో 64 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కోవిడ్ కారణంగా ఒక చిత్తూరు జిల్లాలోనే 14 మంది ప్రాణాలు విడిచారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రతిఒక్కరూ మాస్కులు, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే బయటకు వెళ్లాలని కోరుతున్నారు.
Must Read ‘= కరోనాకు తోడు మరిన్ని.. యూపీలో ఎల్లో ఫంగస్ కేసు
#COVIDUpdates: 24/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 15,90,926 పాజిటివ్ కేసు లకు గాను
*13,76,942 మంది డిశ్చార్జ్ కాగా
*10,222 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,03,762#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/vloYmWA8nk— Health Medical and Family Welfare Department – AP (@ArogyaAndhra) May 24, 2021











