(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ నగరంలో కోవిడ్ వారియర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.లక్ష్మీ అపర్ణ పొట్టకూటి కోసం విశాఖకు వచ్చి ఉద్యోగం చేస్తోందని, తన వలన అబ్బాయి ఇబ్బందులు పడకూడదని పోలీసులను ప్రశ్నించినందుకు ఆమెను మానసిక వేదనకు గురి చేయడం దారుణమని అన్నారు.ఇలా జరిమానా కట్టుకుంటూ పోతే తనకు వచ్చిన జీతం ఫైన్‌లకు అయిపోతుందని ఆవేదన వ్యక్తం వ్యక్తం చేయడంలో తప్పు ఎక్కడ ఉందని అన్నారు.కోవిడ్ వారియర్స్‌కు ఒక వైపు సన్మానాలు చేస్తుంటే,మరో వైపు ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు.సామాన్య ప్రజలకు పోలీసులను ప్రశ్నించే హక్కు లేదా? అని అనిత ప్రశ్నించారు.రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి పోలీస్ వ్యవస్థ నడుస్తోందని, అమ్మాయి పట్ల అమానుషంగా ప్రవర్తించి, మళ్ళీ ఆమెపైనే కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు.ఈ అమ్మాయిని కూడా రెండవ సుధాకర్‌ను చేస్తారా అని అన్నారు.ఆ అమ్మాయికి సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయమనడం దారుణం అన్నారు.ఈ విషయంపై హోం మంత్రి ,మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదన్నారు.విశాఖను పరిపాలన రాజధాని చేయడం పక్కన పెడితే రౌడీ రాజ్యంగా చేస్తున్నారన్నారు.ఈ విషయంపై నగర కమీషనర్ స్పందించి ఆమెపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు.ఆ యువతిని ఇబ్బందులు పెట్టిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సమావేశంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, గణగల్లసత్య,చల్లపల్లి లీలా తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- లక్ష్మీ ప్రసన్నపై దాడి చేయటం సిగ్గుచేటు : నారా లోకేశ్











