కరోనా మొదటి వేవ్ సమయంలో నర్సీపట్నం ప్రభుత్వ ఆసుప్రతిలో కనీసం మాస్కులు కూడా లేవని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు.అప్పట్లో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో సుధాకర్‌ను సస్పెండ్ చేశారు.తరవాత అతనికి పిచ్చి ఉందని విశాఖ మెంటల్ ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స అందించి ఇంటికి పంపారు.ఇది జరిగిన ఏడాదికి డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో చనిపోయారు.ఆసుపత్రుల్లో కనీసం మాస్కులు కూడా లేవని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో దళిత డాక్టర్ వ్యవహారం గత ఏడాది సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇది ప్రభుత్వ హత్యే: చంద్రబాబు
మత్తు డాక్టర్ సుధాకర్ చనిపోవడానికి ప్రభుత్వ నిరంకుశ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.సుధాకర్‌ది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.దళిత డాక్టర్ సుధాకర్ కేవలం మాస్కులు అడిగినందుకు ఉద్యోగం తొలగించి,పిచ్చివాడిగా ముద్రవేసి,అతన్ని మానసికంగా వేధించి చంపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.డాక్టర్ సుధాకర్ మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
Must Read ;- టీడీపీ సీనియర్ నేత హిదాయత్ కరోనాతో కన్నుమూత











