హత్య వెనుక ఆయన ఆ కుటుంబ సభ్యుల పాత్రే ఉంది!
వివేకా హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని హత్య కేసులో నిందుతుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వివేకా కేసు కొత్త మలుపు తిరిగింది. వివేక హత్య వెనుక ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని, వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో కొన్నేళ్లుగా అంతర్గత విభేదాలున్నాయని పిటిషన్ లో ఆమె తెలిపారు. వివేక హత్య కేసులో ఆయన అల్లుడు, చిన బావమరిది రాజశేఖర్ రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తదితరుల పాత్ర ఉందని.. వారినీ సీబీఐ విచారించాలని తులసమ్మ విజ్ఞప్తి చేశారు. కేసుతో సంబంధం లేని వారిని సీబీఐ వేధిస్తోందని, గతంలో సిట్ నివేదికలను బయటపెట్టాలని తులసమ్మ కోరారు.
సీబీఐ దూకుడు..
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు వ్యవహరిస్తోంది. ఇప్పటికే డ్రైవర్ దస్తగిరి, వాచ్మెన్ రంగయ్య, సీఐ శంకరయ్య ల స్టేట్మెంట్స్ ను సీబీఐ నమోదు చేసింది. ఇదే అంశాన్ని జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ముందుకు కూడా వాంగ్మూలం ఇప్పించారు. మరోవైపు భరత్ యాదవ్ దస్తగిరి పై ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి లను సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే! అయితే రెండోసారి దస్తగిరి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐకు కీలక అంశాలను అందాయని, దీంతో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది!
Must Read:-వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్ట్లు! మరోసారి కీలక అంశాలను వెల్లడించిన దస్తగిరి!!











