‘ప్రేమమ్’ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.. మలయాళ అందాల అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే తన అందంతోనూ, క్యూట్ నెస్ తోనూ టాలీవుడ్ ప్రేక్షకుల్ని భలేగా మెప్పించింది. ఆ తర్వాత ‘అఆ , శతమానం భవతి, హలో గురూ ప్రేమకోసమే’ లాంటి మంచి హిట్స్ ఖాతాలో వేసుకుంది. అనుపమా ఎర్లియర్ గా ‘రాక్షసుడు’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. తాజా గా అనుపమా పరమేశ్వరన్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసకు చేరనుంది.
గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త బ్యానర్ లో బన్నీవాసు, సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ‘18 పేజెస్’ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందే ఎప్పుడో లాంచింగ్ జరుపుకున్న ఈ సినిమాలో అనుపమా ను కథానాయికగా కన్ఫామ్ చేస్తూ .. మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ లో ఆహ్వానించడం ఆసక్తిని రేపుతోంది. సుకుమార్ శిష్యుడు , ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ దర్శకుడు అయిన పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ‘18 పేజెస్’ మూవీకి అనుపమా పరమేశ్వరన్ ప్రెజెన్స్ ఏ మేరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
We are ready to turn the beautiful page of our next chapter by welcoming aboard the ever smiling @anupamahere. Hope you have a wonderful journey with us. 🤩🧡#18Pages #AlluAravind @actor_Nikhil @dirsuryapratap @GopiSundarOffl #BunnyVas @raparthysaran @SukumarWritings pic.twitter.com/9L9DmSdjS6
— GA2 Pictures (@GA2Official) October 18, 2020











