ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ కేలండర్, నిరుద్యోగ భృతితోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తానని ప్రామీస్ చేశారు చంద్రబాబు.. ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాట్లపై చంద్రబాబు టీమ్ ఫోకస్ పెట్టింది.. ప్రతి గ్రామంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు..? వారు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేయడంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి..?? ఆ గ్రామ పరిధిలో 20 నుండి 25 మందికిపైగా ఉంటే వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే అంశంపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు చంద్రబాబు..
ప్రతి గ్రామంలోనూ ఈ సర్వే చేస్తున్నారు సంబంధిత అధికారులు.. ప్రతి ఇంట్లో 18 నుండి 50 ఏళ్లలోపు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి సాంకేతిక నైపుణ్యం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏ సంస్థలో జాబ్ చేస్తున్నారు..?? ఎలాంటి జాబ్స్ చేస్తున్నారు..?. అనే అంశాను పరిగణనలోకి తీసుకుంటున్నారు.. వీరికి ఆ గ్రామం లేదా ఆ గ్రామం పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఎలాంటి సదుపాయాలు కోరుకుంటున్నారు..? ముందుగా వీరికి వర్క్ ఫ్రమ్ ఆసక్తి ఉందా.. లేదా అనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు అధికారులు..
ఈ సర్వేలో ఈ ఉద్యోగులు ఏ సంస్థలలో జాబ్ చేస్తున్నారు…?? ఇంటినుండే పని చేస్తే ఇబ్బందులు ఏంటి..?? నెట్ సమస్యలు ఉన్నాయా?? పవర్ కట్ వస్తోందా..?? వారికి ఇంకా ఎలాంటి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలి.?? మెరుగ్గా వారు పని చేయడానికి తగిన వాతావరణం సృష్టించడానికి ఏం చేయాలి..? అనే అంశాలపై దృష్టి పెట్టారు. 20 నుండి 25 మంది మినిమమ్ ఉంటే వారంతా ఆ గ్రామంలోని ఒకే ప్లేస్‌లో పనిచేసుకోవడానికి లేదా సమీపంలో పని చేసుకోవడానికి కావల్సిన సెంటర్లు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఓ నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది.. ఈ మేరకు ప్రయివేటు భవనాలు అందుబాటులో ఉన్నాయా..?? లేదా..?? లేకపోతే ఏం చేయాలి.?? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నారు.. మార్చి 10వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహించి, ఆ తరవాత వీటిపై ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం..
వర్క్ ఫ్రమ్ హోమ్‌తో గ్రామీణ ఆర్ధిక వ్యవస్త కాస్త మెరుగుపడుతుంది.. ఇటు, వలసలు తగ్గుతాయి.. వీటితోపాటు వారికి ఇతర అవకాశాలు పెరిగే చాన్స్ ఉంటుంది.. అందుకే, చంద్రబాబు సర్కార్ ఈ దిశగా నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధం అవుతోందని సమాచారం.. మరి, టెక్నాలజీని వినియోగించుకోవడంలోనే కాదు, దానిని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలోనూ చంద్రబాబు కేరాఫ్.. మరి, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రయోగం దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి..










