జగన్ కధ తిరిగిపోతోందా ? అంతర్గత సర్వేలలో వైసీపీ డొల్లతనం బయటపడిందా ? గత ఎన్నికల్లో జగన్ వెన్నంటే ఉన్న ఆ వర్గాలను మళ్ళీ అక్కున చేర్చుకునేందుకు కొత్త ప్లాన్ వేశారా ? వచ్చే ఎన్నికల్లో టికెట్ లపై సిట్టింగ్ లలో నెలకొన్న భయం ఏమిటి ? జగన్ తాజా వ్యాఖ్యలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి ?
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార , ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నికల వేడిని పెంచుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం ఎన్నికలపై తెలియని భయం నెలకొందనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా ఆ పార్టీ అధినేత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే గేర్ మార్చారనే చర్చ తెరపైకి వస్తోంది.
నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి అయ్యింది. మరో రెండేళ్లలో మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో అభద్రతా భావం మొదలయ్యింది. గత ఎన్నికల్లో తన బొమ్మను చూసే ఓటేశారని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రజల్లో తన గ్రాఫ్ 65 శాతం ఉందని ప్రకటించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తనపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని గుర్తించిన ఆయన మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.
ఇప్పటికే రాష్ట్రంలో జగన్ కి ప్రజలకి మధ్య సంభనధాలు దాదాపు తెగిపోయాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక పీకే ఇచ్చిన తాజా రిపోర్ట్ లోనూ ఇదే అంశాన్ని ఆయన జగన్ కు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తన వెన్నంటి నడిచిన వర్గాలను మళ్ళీ తనకు అనవ్వకూలంగా మలుచుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నారట. అందులో భాగంగానే గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారని టాక్.
నిజానికి గత ఎన్నికల్లో జగన్ కు బలాన్ని చేకూర్చింది యువత, పార్టీ క్యాడరే. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ వారిని పూర్తిగా విస్మరించారట. దీంతో వారంతా ఇప్పుడు జగన్ పై తీవ్రంగా రగిలిపోతున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లోనే నెలకొంది. ఇక ఫ్రీ పధకాలు అందిస్తున్నామని జగన్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి , ప్రభుత్వంలోకి వచ్చాక అందిస్తున్న వాటికి ఎక్కడా పొంతన లేదనే చర్చ జరుగుతోంది. నిజానికి జగన్ అందిస్తున్న పద్ధకాలలో అనేకం గతంలోనూ ఉన్నాయని చర్చ క్షేత్రస్థాయిలో నెలకొందట. ఇక జగన్ పాలనలో కొత్తగా ఒకటి రెండు పధకాలు కనిపిస్తున్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయలేకపోతున్నారట. దీంతో పధకాల అంశంలో లబ్ధి పొందని వారంతా జగన్ పై రగిలిపోతున్నారని టాక్.
ఇదిలా ఉంటే జగన్ చెప్పిన గడప గడపకు వైసీపీ నిర్వహించడం పై ఆ పార్టీ ఎంతలె మల్లగుల్లాలు పడుతున్నారట. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా లేవనే భావన ఆ పార్టీ ఎమ్మెల్యేలలోనే నెలకొందట. ముఖ్యంగా గతంలో అందె అనేక పధకాలు ఈ ప్రభుత్వం ఏర్పాడ్డాక పూర్తిగా నిలిపివేసిన పరిస్థితులు నెలకొన్నాయి.ఉదాహరణకు కళ్యాణలక్ష్మీ వంటి పధకం ఈ మూడేళ్ళలో ఒక్కరికీ కూడా అందించలేదు, ఇలాంటివి అనేక పధకాలు ప్రజలకు దూరమయ్యాయనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతోందట. ఇక ఇసుక రేటు కూడా గటంతో పోలిస్తే ప్రస్తుతం మూడు నుంచి నాలుగు రేట్లు పెరిగిపోయి, సమాన్యుడికి ఇసుక అందని ద్రాక్షాలాగా తయారయ్యిందనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోందట.మరోవైపు నిత్యావసర ధరలు కూడా వైసీపీ ప్రభుత్వంలో బాగా పెరిగిపోయాయనే చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతోంది. అంతేకాకుండా వైసీపీ అధికారమలోకి వచ్చాక రౌడీఇజం కూడా విచ్చలవిడిగా పెరిగిపోయిందనాయి, ప్రజల్లో అభద్రతా భావం పెరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని ఎన్నికల ముందు నుంచి జగన్ సహా వైసీపీ నేతలంతా ఆరోపణలు చేశారు. అయితే వాటిలో ఒక్కటి కూడా ఈ మూడేళ్ళలో నిరూపించలేదు. ఇదే అంశాన్ని టిడిపి ప్రజల్లోకి తీసుకెళ్లింది.ఇక రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ,అభివృద్ధి పనులు కానీ జరుగుతున్న పరిస్థితులు ఎక్కడా ఆకనిపించడం లేవు. ఇవన్నీ బేరఎజు వేసుకున్న వైసిపీ ఎమ్మెల్యేలు ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఆదేశించినట్లు 45 శాతం గా ఉన్న తమ గ్రాఫ్ ను ఏవిధంగా వంద శాతానికి పెంచుకోగలం, అసలు ప్రజల్లోకి వెళితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని లోలోన మదన పడిపోతున్నారట.
ఇక ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకోకుంటా ఎంతటి వారినైనా పక్కన పెడతాం అని జగన్ చేసిన వ్యాఖ్యల పై ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. జగన్ కు కేవలం తన స్క్రిప్ట్ చదివే నాయకులే కావాలి, ఈ క్రమంలో తమను తప్పించేందుకు జగన్ ఈరకమైన కొత్త వ్యూహంతో వచ్చారని కొందరు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. మంత్రివర్గ vవిస్తరణ కూడజ ఈ నేపధ్యమతోనే జరిగిందని, మంత్రుల కంటే జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లే ఎక్కువ పవర్ ఫుల్ అని జగన్ చేసిన ప్రకటన చూస్తే మంత్రులంతా డమ్మీలే అని ఆయన చెప్పకనే చెప్పారని అనుకుంటున్నారట.
అదేసమయంలో ప్లీనరీ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి. అందులో భాగంగానే జగన్ తన గేర్ మార్చారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. మూడేళ్ళలో పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడని జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే తనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత నుంచి వారి దృష్టి మరల్చాలనే ఆలోచనతో ఉన్నారనేది కొందరి వాదనగా కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల అన్నింటినీ రాజకీయ దృక్పధంతో జగన్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుండతా. ఇప్పటికే ప్రజల్లో పధకాలు , ఇతర అంశాలపై ప్రతికూలత నెలకొంది, అది 2024 నాటికి తీవ్ర స్థాయికి చేరుతుంది. అంతకంటే ముందే ముందస్తుకి వెళితే ఎన్నికలు గట్టెక్కేయవచ్చు అనే నిర్ణయానికి వచ్చిన జగన్ , ప్రజలని మరోసారి మోసం చేసేందుకు ఈ విధంగా కొత్త తరహా వ్యూహాలతో వారిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారట.
మొత్తంమీద ఎన్నికల అగ్గి రాజేస్తున్న ఏపీలో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ రచిస్తున్న ప్రత్యేక వ్యూహాలు ఫలిస్తాయా లేక తిరగబడతాయా తెలియాలంటే వేచి చూడాల్సిందే.