జగన్ రెడ్డి మాయ మాకు బాగా అర్థమైంది… బుద్ధొచ్చింది!
జగన్ రెడ్డి చెప్పేవి అన్ని పచ్చి అబద్ధాలే.. మాయ మాటలతో 151 సీట్లు సాధించి గద్దెనెక్కాడు. రాష్ట్రంలో ఆయన పాలనలోని మోసం రోజులు గడిచేకొద్ది అందరికీ అవగతమైంది. నేను ఉన్నాను .. నేను విన్నాను అని చెప్పిన కుటీల నీతి రాజకీయ రంగు నేడు బయటపడింది. ఇక ఉపేక్షించేది లేదు అని ఏపీలోని 13లక్షల మంది ఉద్యోగులు నిర్ణయించారు. వీరందరూ ఐక్య జేఏసీ గా ఏర్పడి జగన్ రెడ్డి ప్రభుత్వంపై పోరు సలపడానికి, సమ్మె సైరెన్ మోగించేందుకు సిద్ధమయ్యారు. అరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే … అలాంటివే ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు .. అంటూ ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఓట్లు లేవా? అవి చాలవా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకంటూ ఒకదశలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బండి. ప్రస్తుతం బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఉద్యోగ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పీఆర్సీతోపాటు ఇతర 70 డిమాండ్లతో ఏపీ ఉద్యోగ సంఘాలు ఐక్య జేఏసీగా ఏర్పాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అడుగులు వేస్తున్న తరణంలో మరోపక్క మాటల పదును కూడా పెంచారు జేఏసీ నేతలు.
ఉద్యోగుల పరిస్థితి చందబాబుకు తెలుసు .. జగన్ రెడ్డి నమ్మి నిండా మునిగాం!
రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసునని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. మూడు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. మూడుసార్లు సమావేశానికి పిల్చి అవమానించారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. అసలు పీఆర్సీ నివేదికనే బయటపెట్టకుండా.. తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్ 10 రోజుల్లో పీఆర్సీ ఇస్తామని చెప్పడం హాస్యస్పదమని బండి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఇక ఉపేక్షించేది లేదు… తాడోపేడో తెల్చుకుంటామని బండి చేసిన వ్యాఖ్యాలు అధికార పార్టీ వైసీపీకి అల్టిమేటం జారీ చేసినట్లేనని భావించవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తాయి. వీటితోపాటు అనుబంధ సంస్థలు, విపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతును తెలుపుతాయి. ఉన్న పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం .. ఉద్యోగ జేఏసీ ఉద్యమం ఊపందుకుంటే ఇక ఉరి తప్పదంటూ అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తంమౌతున్నాయి.
Must Read ;- విసిగిపోయాం.. ఇక ఉద్యమమే! మంత్రి ఇంటెదుట విద్యుత్ ఉద్యోగులు ధర్నా!!











