నివేదిక ఇవ్వకుండా ఎందుకు నాటకాలు!
నమ్మి ఓట్లేసిన పాపానికి నమ్మద్రోహాన్ని చవిచూశారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. గడిచిన రెండు రోజులుగా ఉద్యోగులతో జగన్ రెడ్డి ప్రభుత్వం దోబూచులాడుతోంది. అయితే జేఏసీ నేతలు మాత్రం పీఆర్సీ తోపాటు అనేక సమస్యలను పరిష్కరించేంత వరకు పట్టు వదిలే సమస్యలేదని భీష్మించాయి. నివేదిక ఇస్తాం రమ్మని సచివాలయానికి పిలిచి అవమానించారు. మరసటి రోజు రండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్( జేఎస్సీ) సమావేశంలో చర్చించుకున్నాం అని పిలిచి మరోసారి అవమానించారు. అమరావతి సచివాలయంలో ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖల ముఖ్య కారదర్శులు రావత్, శశిభూషణ్ నేతృత్వంలో జేఎస్సీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్స్ కు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని చర్చించకుండా సమావేశాన్ని ముగించాలని చూడగా .. అసంతృప్తితో 13 ఉద్యోగ సంఘాలలోని 9 సంఘాలు ప్రభుత్వం కప్పదాటు వ్యవహాన్ని నిరసిస్తూ బహిష్కరించాయి.
పరిష్కరించకుంటే ఇక ఉద్యమమే శరణ్యం!
గడిచిన రెండురోజుల నుంచి ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం దోబుచులాడుతోంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటివి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వడంలేదని వాపోతున్నారు. 2022 వరకు వీటిని చెల్లిచుకుంటూ పోతామని ముఖ్య కార్యదర్శులు చెప్పడంతో ఒక్కసారిగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గడిచిన రెండునరేళ్లుగా బకాయి చెల్లించకుండా మీనమేషాలెక్కించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ ఇస్తామని నమ్మించి .. ఇంకా ఆధ్యాయనం చేయాలని చెప్పడంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఇక ఉపక్షిస్తే చరిత్ర హీనులవుతామని గ్రహించి, ప్రభుత్వంతో అమితుమి తేల్చుకునేందు జేఏసీ కార్యచరణ ప్రకటించింది. నివేదిక ఇవ్వగాపోగా ఇంకా మీనమేషాలు లెక్కించి, మభ్యపెట్టేలా ప్రభుత్వ ఉన్నతాధికారుల చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోంచి వారి సమ్మతి లేకుండా సొమ్ము విత్ డ్రా చేసిన అంశంపై విచారణ చేపట్టాలని, అలా ఖాతాల్లోంచి నగదు చేయడం నేరం, సీఎఫ్ఎంఎస్ సీఈవోలపై క్రిమినల్ కేసు పెట్టాలని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
ఉద్యోగులను తొక్కి పట్టి నారతీసున్న సజ్జల!
ఉద్యగులకు ఇచ్చే పీఆర్సీ విషయంలో స్పష్టత ఇవ్వడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగుల సమస్యలను నెరవేర్చే ఆలోచనలు కూడా లేవని చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చినట్లే. కానీ 13 లక్షమంది ఉద్యోగులకు మేం ఏం సమాధానం చెప్పాలో అర్థ కావాడంలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వాపోయ్యారు. వారం ఆగండి .. మరో రెండు రోజులు ఆగండి అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆశలు కల్పించి, నేడు స్పందచకపోవడం విచారకరమన్నారు. పీఎఫ్ బకాయిలు రూ.1000 కోట్లు, ఏపీజీఎల్ఐ రూ. 300 కోట్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్లు రూ. 21 కోట్లు, ఎంప్లాయిస్ హెల్త్ కార్డులకు రూ.40 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల మరో రూ. 40 కోట్లు ఇవ్వాల్సి ఉండగా .. వాటిని తొక్కిపట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఫెన్షనర్ల పట్ల వివక్షచూపుతున్నారని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీరియస్ గా తీసుకుని పరిష్కరిస్తే సరేసరి లేకుంటే కార్యచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు.
Must Read ;- ఏపీలో తిరుగుబాటు బావుట!











