రుణ వాయిదాల చెల్లింపులో జాప్యం
వ్యాపార అవసరాల కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ( ఆర్ఈసీ ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)ల నుంచి రుణాలు తీసుకుంటున్న ఏపీ ఇంధన సంస్థలు సకాలంలో వాయిదాల చెల్లిచడం లేదు. దీని కారణంగా ఆయా కంపెనీ లు వేసిన ఆపరాధ వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది! ఇప్పటికే జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం గతంలో ఎన్నడూ చూడనంతగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. దీనికి తోడూ ఈ ఆపరాధ వడ్డీలు ప్రజాధనంపై ఆదనపు భారం పడేలా చేస్తోంది! రుణ సంస్థలు హెచ్చరికలతో దిగొచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు సిద్ధపడుతోంది!
తీసుకున్న రుణాలకు వడ్డీలు..
2020 మార్చి 31న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి ఏపీ ట్రాన్స్ కో రూ. 500 కోట్లను రుణంగా తీసుకుంది. ఈ రుణ వాయిదాలు 2020 సెప్టెంబరు 10 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ వాయిదాల చెల్లించలేదు. కరోనా నేపథ్యంలో ఇచ్చిన మారటోరియం వెసులుబాటును వినియోగించుకున్నాయి. కానీ దీనివల్ల వాయిదాలపై ఒత్తిడి తగ్గినా.. వడ్డీ పెరుగుతుందని అధికారులకు తెలుసు! దీంతో 11 శాతంతో తీసుకున్న వడ్డీని పీఎఫ్సీ 12 శాతంగా మార్చేసింది. దీంతో రూ 500 కోట్ల రుణంపై రూ. 18.83 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటిదాకా బకాయి చెల్లించకపోవడంతో.. అపరాధ వడ్డీగా రూ. 2.34 కోట్ల చెల్లించాలంటూ పీఎఫ్సీ నోటీసు పంపింది. ఈ మొత్తాన్ని చెల్లిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వు జారీ చేశారు. ఇదిలా ఉంటే కరోనా సమయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి బిల్లులు ముక్కుపిండి మరి వసూలు చేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే సరాఫరా నిలిపివేసి, మరి వసూలు చేశారు. అలా వసూలు చేసిన నగదు ఏమైంది అన్నదే పెద్ద ప్రశ్న!? ఇలా డిస్కమ్ ల నుంచి జెన్కో, ట్రాన్స్ కో లు ఎప్పటికప్పుడు బిల్లులు రాబడుతున్నప్పుడు రుణాల వాయిదాలను సకాలంలో ఎందుకు చెల్లిచడం లేదు? అన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణ లోపించడమేనన్న ఆరోపణలు కూడా లేకపోలేదు!!
Must Read:-జెన్కో ఉద్యోగుల ఆర్తనాదాలు..! నేటికి పడని జీతాలు, పింఛన్లు!!










