తప్పులను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేస్తారా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు ఈ విషయమై ఆయన మండిపడ్డారు. ఆనందయ్యను అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. మందును పక్కదారి పట్టించేవారిని విడిచిపెట్టి, ప్రశ్నించేవాళ్లపై ఎలా కేసులు పెడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనందయ్య మందు దొంగచాటుగా అమ్మేందుకు యత్నించిన వారిపై కేసు నమోదు చేయాలి అని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే సోమిరెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అచ్చెన్నాయుడు అన్నారు.
Must Read ;- ఆనందయ్య మందు అమ్ముకోడానికి స్కెచ్ : చంద్రమోహన్ రెడ్డి











