స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న పుష్ప మూవీలోని ఫస్ట్ పార్ట్ ను ఈ సంవత్సరం చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయనున్నారని సమాచారం. ఇంకా ఫస్ట్ పార్ట్ కు 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బన్నీ చేయనున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఐకాన్. ఈ చిత్రానికి వేణుశ్రీరామ్ దర్శకుడు. ఎప్పటి నుంచో బన్నీ ఈ సినిమాను చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత ఐకాన్ మూవీనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు బన్నీ ఫిక్స్ అయ్యాడని తెలిసింది. ఇటీవల బన్నీ వాసు కూడా ఈ వార్తను బయటపెట్టారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఐకాన్ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ చిత్రం గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్నాయని అంటున్నారు.
ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ ను లాక్ చేయనున్నారని తెలిసింది. అలాగే హీరోయిన్ ఎవరు అన్నది కూడా త్వరలోనే ఫైనల్ చేయనున్నట్టు టాక్. పుష్ప షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను మంచిరోజు చూసి అఫిషియల్ గా అనౌన్స్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఆర్య, పరుగు చిత్రాల తర్వాత దిల్ రాజు బ్యానర్ లో బన్నీ చేస్తున్న సినిమా ఇదే. మరి.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఐకాన్ స్టార్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.
Must Read ;- గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఐకాన్ స్టార్ సినిమా