కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ సినీ ఇండస్ట్రీకి షాక్ అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే.. కన్నడ సినీ ఇండస్ట్రీకే కాదు మిగిలిన సినీ పరిశ్రమలకు కూడా షాకే. పునీత్ మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీని నుంచి బయటడడానికి చాలా టైమ్ పట్టచ్చు. సినీ ప్రముఖులు పునీత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన సినిమా ఎనిమి. ఈ మూవీ దీపావళి సందర్భంగా నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ మాట్లాడుతూ పునీత్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పునీత్ మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. పునీత్ కేవలం మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి. ఒక మనిషి ఇన్ని సహాయ కార్యక్రమాలు చేయగలరా? అని అనిపించింది. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేస్తున్నారు. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారు. ఆయన స్నేహితుడిగా నేను ఆయనకు చేయగలిగింది ఇదే. ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను.
వచ్చే సంవత్సరం నుంచి వారిని నేను నడిపిస్తాను. వారికి అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని ప్రకటించి విశాల్ ప్రకటించారు. ఇలా అనౌన్స్ చేసి పునీత్ కి నిజంగా నిజమైన స్నేహితుడు అనిపించుకున్నారు విశాల్. పునీత్ భౌతికంగా దూరమైనా.. మన మనసుల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు అన్నారు.
Must Read ;- రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల











