దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం ఆనందించాల్సిన విషయం. కొన్ని రాష్ట్రాలు తప్పితే దేశమంతటా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాజకీయ నాయకులైనా.. సెలబ్రిటీలైనా కరోనాకు మినహాయింపు లేదు. ఉపరాష్ట్రపతి నుండి ఎందరో మంత్రలు సైతం కరోనా దెబ్బతిన్నవారే. తాజాగా బీజేపీ నేత జెపి నడ్డా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूँ। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Jagat Prakash Nadda (@JPNadda) December 13, 2020
‘కరోనా లక్షణాలు కనిపించక ఆదివారం రోజున టెస్ట్ చేయించాను. అందులో కరోనా పాజిటివ్‌గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ పాటించాలని నిర్ణయించుకున్నారు. ఇంటి వద్ద నుండే చికిత్స తీసుకుంటాను. కొన్ని రోజులపాటు ఇంటి నుండే పార్టీ వ్యవహారాలు చక్కబెడతాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సందిగా కోరుతున్నాను’ అంటూ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని అందించారు నడ్డా.
Must Read ;- కరోనా వైరస్ కు రుణపడి ఉన్నా: రామ్ గోపాల్ వర్మ











