‘పట్టుపట్ట రాదు.. పట్టి విడువరాదు’ అనే మాట అక్షరాలా బాలయ్యకు వర్తిస్తుంది. అందరూ కరోనా పేరు చెప్పి ఇంట్లో కూర్చుంటే ఆయన మాత్రం ‘అఖండ’ పూర్తి చేసి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. అన్నీ సక్రమంగా సాగితే ఈ నెల 28న ఈ సినిమా విడుదల కావలసి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఇప్పట్లో ప్రారంభమవుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. అవి ప్రారంభమైనా లేకపోయినా సినిమాని మాత్రం పూర్తిచేసి తీరాలన్న పట్టుదలతో బాలయ్య పట్టుదలతో పనిచేసినట్టు తెలిసింది. పైగా ఈ సినిమా టీజర్ కు యూట్యూబ్ లో మూడు వారాల్లోనే 53 మిలియన్ల వ్యూస్ లభించాయి.
బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణకు అన్నీ సూపర్ హిట్లే రావడం కూడా ఈ టీజర్ కు ఇంత స్పందన రావడానికి ఒక కారణం. కరోనా విషయంలో ఆశ్రద్ధ పనికి రాదని కూడా బాలయ్య చెబుతున్నప్పటికీ తగిన జాగ్రత్తలతో షూటింగులో పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించారు. అఘోర గెటప్పులో రౌడీలను వీరబాదుడు బాదే సన్నివేశం ఈ సినిమాలో ప్రధాన హైలైట్ అని చెబుతున్నారు. కరోనా అని చెప్పి షూటింగుకు చరమగీతం పాడేయకుండా శరవేగంగా చితీకరణకు హీరో సహకరించడం అన్నది విశేషమే.