పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, రంగులు మార్చే ఊసరవెల్లి అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ తలరాతను మారుస్తానంటూ, అనవసర ప్రగల్బాలు పలుకుతూ ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు రాజకీయాలపై కనీస అవగాహన లేదని, అందుకే ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని స్థితిలో ఉన్నాడన్నారు.
ఆయనకే చెల్లింది..
2014లో బీజేపీ, టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం, ఆ పార్టీలతో విడిపోవడం, మళ్లీ కలవడం ఆయనకే చెల్లిందన్నారు. ఓ వైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటూ బీజేపీతో ఎలా దోస్తీ కడతాడని ఆయన ప్రశ్నించారు. ఇష్టానుసారంగా పెళ్లిలు చేసుకునే పవన్, ఇరత పార్టీలతో అక్రమంగా పొత్తులు పెట్టుకోక ఇంకేం చేస్తాడని? పవన్ పై భీమవరం ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు.
Must Read ;- భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ!