వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్ వ్యూ అంటే.. అటు చూసే వాళ్లకి.. ఇటు చేసేవాళ్లకి ఓ కిక్ ఇస్తుంటుంది. అందుకనే వర్మని ఇంటర్ వ్యూ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అదే యూట్యూబ్ యాంకర్స్ అయితే.. తమ లైఫే మారిపోతుందని.. ఆయన్ని ఇంటర్ వ్యూ చేయడానికి తెగ ఉత్సాహపడుతుంటారు. వర్మని ఇంటర్ వ్యూ చేసి పాపులర్ అయ్యింది అరియానా. ఎంతగా పాపులర్ అయ్యిందంటే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేంత. దీంతో వర్మతో ఇంటర్ వ్యూ చేయడానికి ఇప్పుడు యూట్యూబ్ యాంకర్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు.
Must Read ;- బిగ్ బాస్ 4 విన్నర్ గా ఆమెను గెలిపించమంటున్న వర్మ
ఇక వర్మతో ఇంటర్ వ్యూ చేసే ఛాన్స్ వస్తే.. ఏమాత్రం మొహమాట పడడం లేదు. ఎలాంటి ప్రశ్నలు అయినా సరే అడిగేస్తున్నారు. రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి వర్మ ఇంటర్ వ్యూ ఇచ్చారు. వర్మని ఇంటర్ వ్యూ చేసిన ఆ యాంకర్ ఓ ఆట ఆడేసుకుందాం అని బాగా ప్రిపేర్ అయినట్టుంది. కానీ.. అక్కడ ఉంది వర్మ కదా.. ఆయన ఇచ్చే ఆన్సర్స్ కి ఏం చేయాలో.. ఎలాంటి సమాధానం చెప్పాలో.. తెలియక సిగ్గుపడుతూ ఉండిపోవాల్సివచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. తొడలు కనిపించేలా డ్రెస్ వేసుకుని.. మాటమాటకి డ్రెస్ సర్ధుకుంటూ కనిపించింది. ఇంటర్ వ్యూలో పర్సనల్ విషయాల గురించి అడగడం..మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే.. మీలో ఉన్న గట్స్ నేను ఎవరిలో చూడలేదు. మీరు ప్రతి విషయంలో నాకు బాగా నచ్చేసార్.. అని అలాగని నేను మీ ఫ్యాన్ ని కాదు సార్ అంటూనే తెగ పొగిడేసింది. మీరు పెద్ద హీరోలతో సినిమాలు చేయరు. మీరు సినిమా తీయాలంటే ఏం ఉండాలి సార్ అని యాంకర్ అడిగితే… నేను సినిమా తీయాలంటే కండలు అయినా ఉండాలి.. లేదా తొడలు అయినా ఉండాలి అంటూ ఆ యాంకర్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు వర్మ.
వర్మ ఆన్సర్ కి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని తెగ సిగ్గుపడిపోయింది ఆ యాంకర్. అంతటితో ఆగకుండా మీ దగ్గర ప్రతిదానికి సమాధానం ఉంటుంది సార్ అంటే.. అవును నేను నేను అమ్మాయి తొడలు చూసి ప్రేరణ పొందుతా.. మగాళ్ల కండలు చూసి ఇన్స్ప్రేషన్ అవుతా.. ఈ రెండే కావాలి అని ఏమాత్రం మొహమాటం లేకుండా తనదైన స్టైల్ లో చెప్పారు. ఇంతకీ మీకు ఏం కావాలి సార్.. అని వర్మని అడిగింది ఆ యాంకర్.. అలా అడిగితే వర్మ చెప్పకుండా ఉంటాడా..? వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. నాకు కావాల్సింది మీరు ఇవ్వరు.. ఇవ్వలేరు.. ఇవ్వనప్పుడు చెప్పడం దేనికి.? అని ప్రశ్నించాడు.
ఒకవేళ ఇచ్చే ఉద్దేశం ఉంటే అడగండి అంటూ చాలా తెలివిగా తన మనసులో మాటలను బయటపెట్టారు వర్మ. ఆ ఆన్సర్ కి యాంకర్ తెగ సిగ్గుపడిపోతూ అయ్యో అంటూ తెగ మెలికలు తిరిగింది. ఇక అక్కడ నుంచి ఇంటర్ వ్యూ మరో లెవల్ కి వెళ్లింది. వర్మ క్రష్, సెక్సువల్ రిలేషన్స్ షిప్‌పై కూడా యాంకర్ ప్రశ్నలు అడగడంతో ఇద్దరి మధ్య బూతుల వరద అలా.. అలా.. పారింది. వర్మ అయితే.. డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయారు.
Also Read ;- బిగ్ బాస్ 4 విజేత ఎవరో బయటపెట్టిన అవినాశ్..