‘బిగ్ బాస్ 4’ చివరి ఎపిసోడ్ మొన్న ఆదివారం ప్రసారమైంది. విన్నర్ ఎవరు? .. రన్నర్ ఎవరు? అనే విషయంలో ఊహాగానాల సంగతి అటుంచితే, చివరివరకూ ఉత్కంఠ కొనసాగింది. విజేతగా అభిజిత్ నిలవగా .. రన్నర్ గా అఖిల్ మిగిలాడు. ‘బిగ్ బాస్’ హౌస్ లో చివరిరోజు వరకూ ఉన్న అఖిల్ అక్కడి నుంచి తన ఇంటికి చేరుకున్న తరువాత, సోషల్ మీడియా ద్వారా తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.
‘బిగ్ బాస్‘ షో ద్వారా నాకు ఇంతటి క్రేజ్ వస్తుందని నేను అస్సలు గెస్ చేయలేదు. పొద్దున లేచి చూడగానే మా ఇంటిముందు విపరీతమైన జనం .. మా కాలనీ అంతా జనంతో నిండిపోవడం చూసి నేను షాక్ అయ్యాను. పెద్దవాళ్లు మాత్రమే కాదు .. చిన్న చిన్న పిల్లలు కూడా మా ఇంటికి వచ్చి నాతో సెల్ఫీలు తీసుకున్నారు. నేనంటే ఇష్టమనీ .. నాకు ఓటు వేశానని చెప్పారు. వాళ్లందరినీ అలా చూస్తుంటే నన్ను ఇంతమంది ఇంతగా అభిమానించారా? ఇంతగా ప్రేమించరా? అని ఆశ్చర్యం కలిగింది. ఆ ఆనందం ఎంతటిదో చెప్పడానికి అక్షరాలు చాలవు.
నిజానికి నేను ఫస్టు వీక్ లోనే ‘బిగ్ బాస్’ హౌస్ లో నుంచి బయటికి వచ్చేస్తానని చాలా భయపడ్డాను. ఎందుకంటే నాకు ఎక్కువ సపోర్ట్ లేదు. మిగతా పోటీదారులకి చాలామంది స్నేహితులు .. కొలీగ్స్ .. కొంతమంది సెలబ్రిటీలు సపోర్ట్ చేశారు. నాకు ఓ ఇద్దరు సెలబ్రిటీలు మాత్రమే సపోర్ట్ చేసినట్టుగా తెలిసింది. మోనల్ బయటికి వచ్చిన తరువాత నాకు చాలా సపోర్ట్ చేసిందట. అందుకు ఆమెకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. మీరంతా కూడా ఎంతో నిజాయితీతో ఓట్లు వేసి నన్ను చివరి వరకూ బిగ్ బాస్ హౌస్ లో ఉంచారు. నేను కప్పు గెలవలేక పోవచ్చు. కానీ మీ హృదయాలను గెలిచాననే సంతోషం ఉంది. మీ అందరూ నాపై ఉంచుతూ వచ్చిన నమ్మకాన్నీ .. అభిమానాన్ని ఎప్పటికీ నిలుపుకుంటానని మీకు మాట ఇస్తున్నాను” అంటూ అఖిల్ భావోద్వేగానికి లోనయ్యాడు.
Must Read ;- బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే హైలైట్స్











