బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జై రాజ్ ను చిత్ర పరిశ్రమ చిన్న చూపు చూస్తోందా? అన్న ప్రశ్న తలెత్తింది. ఫిలింనగర్ లో ఆయన విగ్రహం ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన తెలంగాణ మంత్రి వద్ద కూడా వచ్చింది. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు జైరాజ్. సెప్టెంబర్ 28న అయన 112వ జయంతి సందర్బంగా మంగళవారం ఫిలిం ఛాంబర్ లో వేడుకలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ‘పైడి జైరాజ్ తెలంగాణ నటుడు.
అప్పట్లో అందరూ సినిమాల్లో రాణించాలని మద్రాసు వెళితే మన జైరాజ్ మాత్రం ముంబై రైలెక్కి వెళ్లి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ఆ తరువాత దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం తెలంగాణ వారిగా మనకు గర్వకారణం. పైడి జైరాజ్ తెలంగాణ నటుడు. కళాకారులకు జాతి, ప్రాంతం భేదం ఉండదు. అయన జ్ఞాపకార్థంగా రవీంద్ర భారతిలో పైడి జైరాజ్ హలును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిలిం నగర్ ప్రాంతంలో ఛాంబర్ పరిధిలో అయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
నిజానికి అది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది. కానీ చేయలేదు ఇప్పటికైనా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయాలి’ అన్నారు.నటుడు జైహింద్ గౌడ్ మాట్లాడుతూ.. ‘పైడి జైరాజ్ 1980 లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి . ఆయనను తెలుగు పరిశ్రమ మరచిపోయింది. అయన జయంతి వేడుకలు కూడా ఇక్కడ చేయడం లేదని తెలిసి నేను 2010 నుండి అయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. కనీసం అయన ఫోటో ఛాంబర్ లో పెట్టడానికి కూడా మొదట్లో ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు జైరాజ్ గురించి తెలిసి అందరు సహకారం అందిస్తున్నారు.
జైరాజ్ అప్పట్లోనే అంటే మూకీల సమయంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి. అయన జీవితం మనందరికీ ఆదర్శం. అలాంటి మహనీయుడిని మనం మరచిపోకూడదు . అయన జయంతి వేడుకలు ఇంకా గ్రాండ్ గా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నా విన్నపం ఏమిటంటే ఫిలిం ఛాంబర్ ఆవరణలో, లేదా ఫిలిం నగర్ లో పైడి జైరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రిగారికి ఈ సందర్బంగా కోరుకుంటున్నాను’ అన్నారు.
Must Read ;- నామినేషన్లు దాఖలు చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్











