లాస్టియర్ ‘అల వైకుంఠపురములో’ మూవీతోనూ, ఈ ఏడాది తమిళ సినిమా ‘మాస్టర్’ తోనూ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం సౌత్ లో ఆమె హవా మామూలుగా లేదు. మరోవైపు బాలీవుడ్ లోనూ ఆమెకు మంచి డిమాండే ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య లోనూ , ప్రభాస్ రాధేశ్యామ్ లోనూ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లోనూ, ఇంకా ‘సర్కస్’ అనే హిందీ సినిమాలోనూ అమ్మడు కథానాయికగా నటిస్తోంది. అలాగే.. త్వరలో చేయబోయే మహేశ్ బాబు త్రివిక్రమ్ మూవీలో సైతం ఆమెనే కథానాయికగా ఎంపిక చేశారు.
ఇవే కాకుండా ఇప్పుడీ బుట్టబొమ్మ తమిళంలో దళపతి విజయ్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో మూవీలో కూడా కథానాయికగా నటిస్తోంది. అందుకేనేమో .. పూజా బేబ్.. తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేసిందని టాక్స్ వినిపిస్తున్నాయి. విజయ్ మూవీ కోసం ఏకంగా ఆమె రూ. 3కోట్లు పారితోషికం అందుకుందట. ప్రస్తుతం ఆమెకు మంచి డిమాండ్ ఉండడంతో మేకర్స్ .. ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమయ్యారట. పూజా కెరీర్ లో ఇదే భారీ రెమ్యునరేషన్ కావడం విశేషం.
నిజానికి పూజా హెగ్డే కెరీర్ కోలీవుడ్ లోనే మొదలైంది. జీవా హీరోగా, మిస్కిన్ డైరెక్షన్ లో రూపొందిన ‘ముగమూడి’ (తెలుగులో మాస్క్ గా విడుదలైంది) సినిమాతో పూజా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో.. పూజా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇక్కడ గ్రాడ్యువల్ గా సక్సెస్ సాధిస్తూ టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఎక్కడైతే అయితే తాను హీరోయిన్ గా గుర్తింపు పొందలేకపోయిందో .. ఇప్పుడు అక్కడే కథానాయికగా హైయస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటూడడం గ్రేటే అని చప్పాలి. మరి అమ్మడి కెరీర్ తమిళంలో ఎలా ఉండబోతుందో చూడాలి.
Must Read ;- ‘బుట్టబొమ్మ’ గా మలయాళ ‘కప్పేళ’?