తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ – మెగాస్టార్ చిరంజీవి వీరిద్దరూ మంచి స్నేహితులు. రజనీకాంత్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ రావడం.. కరోనా రావడంతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం తెలిసిందే. ఆ తత్వాత రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యి చెన్నైలోని ఇంటికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. రజనీ తన రాజకీయ పార్టీని డిసెంబర్ 31న ప్రకటిస్తానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు అనారోగ్యం కారణంగా డిసెంబర్ 31న రాజకీయ పార్టీని ప్రకటిస్తారా..? ప్రకటించరా..? రజనీ ఏం చెబుతారా.? ఎలాంటి ప్రకటన చేస్తారా.? అని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. రాజకీయాల్లోకి రానంటూ ఈరోజు రజనీకాంత్ ప్రకటించి షాక్ ఇచ్చారు.
దీనికి రజనీకాంత్ చెప్పిన కారణం ఏంటంటే.. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేసినప్పటికీ యూనిట్ లో కొంత మందికి కరోనా వచ్చింది. అలాగే తనకు బ్లడ్ ప్రషర్ ప్రాబ్లమ్ వచ్చింది. వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకోమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాలేను. అభిమానులు నన్ను క్షమించండి అంటూ ఓ మూడు పేజీల లేఖను విడుదల చేసారు. డిసెంబర్ 31 కంటే ముందుగానే రజనీ ఈ ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. రజనీకాంత్ ఈ నిర్ణయం తీసుకోవడం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. రజనీకాంత్ అపోలో హాస్పిటల్ లో ఉన్నప్పుడు చిరంజీవి వెళ్లి కలిశారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం అంత మంచిది కాదని చెప్పారని. అలాగే రజనీకాంత్ కుమార్తెలు కూడా రాజకీయాల్లోకి వెళ్లద్దని చెప్పారని.. అందుకనే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ వేసారని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైతేనే.. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించారు.
Must Read ;- రజనీకాంత్ అప్పుడు చాలా ఫీలయ్యారట!