మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య కాలంలో వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆతర్వాత ఆయన వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ లో నటించబోతున్నారు. ఈ సినిమాను జనవరి నెలలో స్టార్ట్ చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అది పూర్తి అయిన వెంటనే చిరు తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటారు. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ మూవీలో అజిత్ మాస్ రోల్ అభిమానుల్ని భలేగా అలరించింది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2021 ఆగస్టు తర్వాత సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుందట. కథకు తగ్గట్టుగా సినిమా కోల్‌కత్తాలో అయితే బాగుంటుందని వారు ఈ అభిప్రాయానికి వచ్చారని వినికిడి. ప్రస్తుతం దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమా కోసం ప్రత్యేక లొకేషన్స్ వేటలో పడ్డాడని సమాచారం. ఇక ఇందులో చిరు సోదరి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమాకి మణిశర్మ తనయుడు సాగర్ సంగీతం అందివ్వనున్నట్టు టాక్ వినపడుతుంది. ఇంతకముందు దర్శకుడు మెహర్ రమేష్ తీసిన ‘కంత్రి’, ‘శక్తి’, ‘బిర్లా’, ‘షాడో ‘సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమా మెహర్ రమేష్ కెరీర్ కు కోలుకోలేని దెబ్చ కొట్టింది.. అందుకే .. చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకొని, తన కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టుకోవాలని.. ఆయన చూస్తున్నాడు . మరి మెహర్ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.











