ఏపీలో కరోనా సెంకడ్ వేవ్ ఉధృతి కొంత తగ్గినా, ఎక్కువగా చిన్నారులపై ప్రభావం చూపుతోంది. గడచిన రెండు వారాల్లోనే 20 వేల మంది చిన్నారులు కరోనా భారినపడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్పుడే ఏపీలో థర్డ్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. థర్డ్ వేవ్‌లో చిన్నారులపై కరోనా ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే మరో రెండు నెలల తరవాత కరోనా థర్డ్ వేవ్ వస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున చిన్నారులు కరోనా భారిన పడటం ఆందోళన రేకెత్తిస్తోంది.
మహారాష్ట్రలో మొదలైంది..
చిన్నారులు కరోనా భారిన పటడం ముందు మహారాష్ట్రలో ప్రారంభమైంది. అక్కడ ఇప్పటికే 30 వేల మంది చిన్నారులు కరోనా భారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఏపీలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కనిపిస్తోందని, అందుకే చిన్నారులు కూడా కరోనా భారిన పడుతున్నారని వైద్యు నిపుణులు చెబుతున్నారు. గడచిన రెండు వారాల్లో ఏపీలో 2.3 లక్షల మంది కరోనా భారిన పడగా అందులో 23,920 మంది 18 ఏళ్ల లోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
హాట్ స్పాట్‌గా తూర్పుగోదావరి జిల్లా
ఏపీలో తూర్పుగోదావరి జిల్లా కరోనాకు హాట్ స్పాట్‌గా మారింది.ఒక్క తూర్పుగోదావరిలోనే సుమారు 4,200 మంది కరోనా భారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో మరో 3,800 చిన్నారులు కరోనా భారినపడ్డారు. ఏపీలో 30 లక్షల మంది చిన్నారులు కరోనా భారిన పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. పిల్లల్లో మల్టీ సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ దాడి చేయవచ్చని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్