ఎందరో రోగులకు కరోనా నుంచి విముక్తి కల్పించిన ఆ యువ వైద్యురాలు ఆ మహామ్మారికే బలయింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన రోజి నీట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలలో సీటు సంపాదించింది.ఎంబీబీఎస్ పూర్తి చేసి అదే ఆస్పత్రిలో హౌస్ సర్జన్ చేస్తోంది.విధుల్లో భాగంగా కొవిడ్ రోగులకు చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాలను ఆమె కాపాడారు.ఈ క్రమంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమెకు కరోనా సోకింది.కొన్నిరోజులు ఇంటివద్దే చికిత్స తీసుకోగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను మోరిలోని సుబ్బమ్మ కొవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్‌లో చేర్చారు. అక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేక పరిస్థితి విషమించి మంగళవారం రోజి మృతి చెందింది.చిరు ప్రాయంలోనే ఆ యువ డాక్టర్ కరోనాకు బలి కావడంపై పలువురు కన్నీటి పర్యంత మవుతున్నారు.
Must Read ;- డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసింది : నారా లోకేశ్