అన్యాయంగా ఇరికించాలని చూస్తే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది!
ఆనాడు కోడి కత్తి, వివేకా హత్యను సాకుగా చూపి.. రాజకీయంగా వాడుకున్నారన్నది క్లియర్. అది సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ సునీతా, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలే ప్రత్యక్షంగా ఆరోపింస్తున్న వాస్తవాలు. వివేకా హత్య కేసులో నిందుతులు, కుటుంబ సభ్యులు సీబీఐకిచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా ఒయటకొచ్చేకొద్ది ఇప్పడు అధికార వైసీపీ, జగన్ రెడ్డి గుండెల్లో దడపుడతోంది. చట్టం తన పని తాను చేసుకుంటుపోతోంది.. విపక్షాలు తనదైన శైలిలో వాస్తవాలను విశదీకరిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ అటువంటి చర్యలు, కామెంట్స్ అధికార వైసీపీకి నచ్చడంలేదు. బాగా హర్డ్ అవుతున్నారు. అందుకేనేమో సీబీఐ అధికారులపై కేసులు, ప్రతిపక్ష టీడీపీ కక్షసాధింపు చర్యలు దిగుతున్నారు. మొత్తంగా బాబాయిని చంపిన అబ్బాయిలేవరో.. ప్రజలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆ పార్టీ, జగన్ రెడ్డి కేసు కప్పింపుచ్చుకోవానికి ఎంత బుకాయించినా.. వివేకా దారుణ హత్యకు పాల్పడిన ఘాతుకులకు శిక్షపడక తప్పదు అన్నట్లు ప్రస్తుత వాతావరణం సంకేతాలనిస్తున్నాయి.
హత్య రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వారిదేనా?
వివేకా హత్య కేసుల్లో పాత్రదారులు, సూత్రదారులు వంతు ఒకవైపే అయితే .. ప్రముఖ పాత్ర పోషించిన వారే కీలకం మారారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు చెబుతున్న కఠిక నిజాలన్నీ వైసీపీ పాత్రనే అనుమానిస్తున్నాయి! ఈ కేసును సాధ్యమైనంత త్వరగా అప్పుడే క్లోజ్ చేసి ఉంటే.. రాజకీయంగా వైసీపీకి కొంత బెటర్ గా ఉండేదేమో! కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా హత్య విపక్షాలకు విమర్శనాస్త్రాలు మారుతున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలే అధికార వైసీపీని ఇరకాడంలో పెడుతున్నాయి. కేసులో సీబీఐ సేకరించిన వాంగ్మూలాల్లో వాస్తవాలన్ని జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లే సూత్రదారులని పరోక్షంగా తేలుస్తున్నాయి. ఈ హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసని టీడీపీ, వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసమో చంద్రబాబుపై హత్యకేసును డైవర్ట్ చేశారని తెలుగు దేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు వివేకా కుమార్తె వైఎస్ సునీతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కు ఫిర్యాదు చేయడం చర్చకు దారితీస్తోంది!
Must Read:-వివేకా హత్య కేసులో మరిన్ని అరెస్ట్లు! మరోసారి కీలక అంశాలను వెల్లడించిన దస్తగిరి!!











