కరోనా వైద్యంలో రోగులకు సంజీవనిలా మారిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల సరఫరాను నిలపివేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దేశంలో పెద్ద ఎత్తున రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల ఉత్పత్తి ప్రారంభమైందని కేంద్ర రసాయనాలు,ఎరువుల శాఖా మంత్రి మన్‌సుక్ మాండవీయ ప్రకటించారు.గత నెల 11న రోజుకు దేశ వ్యాప్తంగా 33 వేల వయల్స్ ఉత్పత్తి జరగ్గా నేడు రోజుకు 3,50,000 వయల్స్ ఉత్పత్తి జరుగుతోందని ఆయన ప్రకటించారు.దేశంలో ఇవాళ 60 కంపెనీలు రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నాయని ఆయన తెలిపారు.అవసరానికి మించి దేశంలో రెమ్‌డెసివర్ ఉత్పత్తి జరుగుతోందని ఆయన ప్రకటించారు.
ముందు జాగ్రత్తగా..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు రెమ్‌డెసివర్ పంపిణీ చేసింది.ఈ సూది మందుకు డిమాండ్ అదికంగా ఉండటం,గత నెలలో తయారీ తక్కువగా ఉండటంతో పలు రాష్ట్రాల అవసరాలను సమీక్షిస్తూ కేంద్రం సరఫరా చేసింది. ఇవాళ డిమాండ్ కన్నా తయారీ ఎక్కువగా ఉందని,ఇక రెమ్‌డెసివర్ సరఫరాలో కేంద్రం జోక్యం చేసుకోబోదని రసాయనాల మంత్రి మాండవీయ వెల్లడించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు కేంద్రం 50 లక్షల రెమ్‌డెసివర్ వయల్స్ కొనుగోలు చేసి సిద్దంగా ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు.దేశంలో ఎక్కడా రెమ్‌డెసివర్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
Must Read ;- పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.. కరోనా థర్డ్ వేవ్‌పై కేటీఆర్ సూచనలు











