కరోనా మహమ్మారి విరుచుకుపడుతుండటంతో ఒక్కో దేశం ఒక్కో టీకాను తయారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే వైరస్ ఎదుర్కొనేందుకు ఎన్నో రకాల టీకాలు ఉన్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్, రెమిడెసివర్.. ఇలా అందుబాటులో లభించే వ్యాక్సిన్ తో వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజగా కరోనా వైరస్ ఖతం చేసే మరో కొత్త పద్ధతి మనముందుకు రాబోతోంది. అదే నాసల్ స్పే.
‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ కొత్త రకమైన మందును తయారు చేస్తోంది. ఇది ముక్కులో స్ప్రే చేస్తే, అందులో ఉన్న వైరస్ ను చంపేస్తుందట. అయితే చాలామందికి కరోనా వైరస్ సోకగానే శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఒకసారి స్ప్రే చేస్తే కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందట. ఇప్పటికే కొన్ని దేశాల్లో సమర్థవంతంగా ఇది పనిచేస్తుందట. త్వరలో మనదేశంలో కూడా అందుబాటులోకి రావచ్చు.
Must Read ;- భారత్‌కు త్వరలో mRNA కరోనా టీకాలు.. లుపిన్ ఫార్మా సన్నాహాలు











