ప్రభుత్వ నిర్లక్ష్యం .. ఒక చారిత్రక తప్పిదం!
ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే కడపలోని అన్నమయ్య ప్రాజెక్ట్ నీటిలో కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఇంకా స్వరం పెంచి మంత్రి వ్యాఖ్యలు చేశారు… ‘మీ నిర్లక్ష్యం వలన కాదా.. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోయింది. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులు మీరు కాదా? వరద ఒక్కసారిగా వస్తుందని తెలిసి.. హడావుడిగా ఐదు గేట్లు తెరవడం, అందులో ఒక గేటు పనిచేయకపోవడం లేదని ముందుగానే తెలిసి బాధ్యతగా ఎందుకు వ్యవహరించలేదు? ఆ ఒక్కగేటు తెరుచుకోకపోవడం కారణంగానే ఈ విధ్వంసం జరిగింది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు’
అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీశారు.. !
అన్నమయ్య ప్రాజెక్ట్ వరద నీటిలో కొట్టుకుపోవడంతో ఏపీ పరువు ఒక్కటే కాదు… భారత్ పరువు కూడా పోయిందని మంత్రి అన్నారు. ఇదే అంశం అంతర్జాతీయ వేదికల మీదా భారత్ లో మరో ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందంటా.. అని కామెంట్స్ చేస్తారు. దీనిపై స్టడీ చేస్తే పరువు ఏం కావాలి. ప్రపంచ స్థాయిలో పరువు పోదా అని అక్రోసించారు. దీని ఏపీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతోందని నిలదీశారు. ప్రాజెక్ట్ వరదలో కొట్టుకుపోయిందన్న అంశం చాలా దూరం పోతుందని, భారత్ లో మరో వంతెన తెగిపోయిందని ప్రపంచ వ్యాప్తంగా ఇంజనీర్లు దీనిని కేసు స్టడీగా తీసుకుంటే, ఎంత అవమానకరమని అవేదన వ్యక్తం చేశారు. దీని బాధ్యత, జవాబుదారీతనం జగన్ రెడ్డి ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పారు.
Must Read ;- మీ పెత్తనం చాలు ఆపండి ..! జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్!!











