దేశ ఔన్నత్యాన్ని, జాతీయ పతాక గొప్పతనాన్ని చాటిన మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ఇచ్చి గౌరవించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. జాతీయ జెండాకు వందేళ్లు అయిన సందర్భంగా చంద్రబాబు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి జాతీయ పతాకం.. ప్రతీక అని చెప్పారు. వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో పింగళి వెంకయ్య స్ఫూర్తి, చూపిన చొరవ అందరికీ ఆదర్శమని కీర్తించారు. త్యాగం, శాంతి, ప్రగతి అనే మూడు ప్రతీకలను త్రివర్ణం తన సిగలో అలంకరించుకుందని, అశోక చక్రం ధర్మానికి సూచికగా నిలిచిందని వివరించారు.
Also Read:తిరుపతిపై చంద్రబాబు ఫోకస్.. ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్