నితిన్ హీరోగా నటిస్తున్న ‘చెక్’ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీ విడుదల కానుంది. టైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ లో ఆసక్తి కలిగించే అంశాలు ఉన్నాయి. ‘రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి’ అని ప్రశ్నిస్తే ‘యుద్దం మొదలు పెట్టేదే సిపాయి’ అంటాడు హీరో నితిన్. అతని ధైర్యాన్ని సూచించే డైలాగ్ ఇది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథలో మనం ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ చూశాం. ఇది కూడా అలాంటిదే. ఇలాంటి శిక్ష పడ్డ ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితులతో ఎలాంటి పోరాటం చేశాడు అన్నదే ఇందులోని ప్రధాన అంశం.
చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. చదరంగంలో రాజు చెక్ ఎలా చెప్పాలో అందరికీ తెలుసు. అలాంటి మైండ్ గేమ్ ఈ కథలోనూ ఉంటుందని అనుకోవాలి. ‘అణువు నుంచి అనంతం వరకూ కర్మ నుంచి ఏదీ తప్పించుకోలేదు’ అని నటుడు మురళీ శర్మతో ఇందులో ఓ డైలాగ్ చెప్పించారు. సినిమా మీద ఆసక్తిని పెంచేలా డైలాగ్స్ కట్ చేశారు.
హీరో నితిన్ ను ఖైదీలా చూపించారు. ‘నువ్విక్కడ ఏంచేసినా కొన్ని కళ్లు చూస్తూనే ఉంటాయి’ అనే డైలాగ్ తోపాటు ‘ఆదిత్య కేసులో క్షమాభిక్షకు అవకాశం ఉందా?’ అనే మరో డైలాగ్ ఉంది. ఇందులో హీరో పాత్ర పేరు ఆదిత్య అని అర్థమవుతోంది. పూర్తిగా ఇది యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అసలు ఈ సినిమాని ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత ఈ తేదీని 26కు మార్చారు. సీజీ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల విడుదల తేదీని 26కు మార్చాల్సి వచ్చిందని నిర్మాత ఆనందప్రసాద్ తెలిపారు.
Must Read ;- ఫిబ్రవరి 19న ‘చెక్’ పెట్టడానికి రెడీ అవుతోన్న నితిన్