కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో సక్సస్ సాధించింది. అంతే.. అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సక్సస్ సాధించి స్టార్ హీరోయిన్ అయ్యింది. మహేష్ బాబుతో స్పైడర్, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో ధృవ.. ఇలా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.

అయితే.. ఇటీవల తెలుగులో సరైన సక్సస్ సాధించకపోవడంతో కెరీర్ లో వెనకబడింది. దాంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అక్కడ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం జాన్ అబ్రహం ఎటాక్, అజయ్ దేవగన్, అమితాబ్ మేడే, సిద్ధార్ధ మలల్హోత్రా, అజయ్ దేవగన్ థ్యాంక్ గాడ్ చిత్రాల్లో నటిస్తుంది. టాలీవుడ్ లో రకుల్ కి అంతగా అవకాశాలు లేకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం బిజీగా ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు కావడం విశేషం.
ఇప్పుడు డాక్టర్ జి అనే మరో బాలీవుడ్ మూవీలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి తొలిసారిగా రకుల్ నటిస్తోంది. ఈ సినిమాలో డాక్టర్ ఫాతిమా అనే వైద్య విద్యార్థిగా రకుల్ నటించనుంది. క్యాంపస్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డాక్టర్ ఉదయ్ గుప్తా అనే పాత్రలో ఆయుష్మాన్ నటిస్తున్నారు. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటించడం గురించి రకుల్ స్పందిస్తూ… డాక్టర్ జి లో భాగం కావడం పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్‌ను అందిస్తుంది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
Must Read ;- రకుల్ చేతిలో అన్ని సినిమాలు ఉన్నాయా.?











