April 13, 2026 11:33 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘విశాఖ ఉక్కు’కు ఎందరో ప్రాణత్యాగం.. మేల్కొనక పోతే అన్యాయమే

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలై 32 బంది బలిదానంతో ఏర్పాటై నవరత్నాల్లో ఒకటిగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఉద్యమం మొదలైన నేపథ్యంలో 22మంది ఎంపీలున్న వైసీపీ కేంద్ర నిర్ణయాన్ని ఎంతవరకు అడ్డుకుంటుందో చూడాలి.

February 5, 2021 at 4:44 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ఓ వైపు మూడు రాజధానుల ఉద్యమం జరుగుతుండగా మరో ఉద్యమానికి తెరలేచింది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసే దిశగా కేంద్రం అడగులు వేయడంతో ఉద్యమం మొదలైంది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలై 32 బంది బలిదానంతో ఏర్పాటై నవరత్నాల్లో ఒకటిగా నిలిచిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే నిర్ణయం వెనుక కుట్ర ఉందని కూడా విమర్శలు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారంతో కేవలం వైజాగ్‌కి మాత్రమే కాదు..తెలుగు రాష్ట్రాలతోనూ సెంటిమెంట్ బంధం ఉంది. ఆనాటి ఉద్యమంలో అప్పటి ఏపీ నుంచి అన్నిప్రాంతాల నేతలూ ఇందుకు పోరాడారు. విశాఖ ఉక్కు కోసం.. ఆదిలాబాద్‌లోనూ ప్రాణత్యాగం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నో ఒత్తిళ్లూ ఎదుర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించారు. ఆనాటి పరిస్థితిని చూసిన రాజకీయ నాయకులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆ విషయాలను పరిశీలిస్తే..

అంత ఉద్యమం ఎందుకు..

1960వ దశకంలో ఆంధ్రప్రదేశ్ అన్నిరకాల సంక్షిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలూ ఇందుకు కారణం అయ్యాయి. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా అమలవుతున్న కార్యక్రమాల్లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందనే వాదన అప్పటికే ఉంది. అంతే కాకుండా ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయి (1953) 10 ఏళ్లు అవుతున్నా ఏపీ (1956)లో పలు ఇబ్బందులు నెలకొన్నాయి. 1960ల్లోనూ ఆ ఇబ్బందులను అధిగమించలేదు. మద్రాసీ అనే ముద్ర నుంచి బయటపడలేదు. అప్పటికే అన్నివర్గాల్లోని మేథావుల్లో ఆ అభిప్రాయం నెలకొంది. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన మాత్రమే పరిష్కారమని మేథావులు నినదించారు. అదే సమయంలో నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో రూర్కెలా(ఒడిశా), భిలాయ్(అప్పటి మధ్యప్రదేశ్  ప్రస్తుత చత్తీస్‌ఘడ్), అసన్‌సోల్ (పశ్చిమబెంగాల్)లలో మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. నాలుగోది బొకారో ( అప్పటి బీహార్, ఇప్పటి ఝార్ఖండ్ ) ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. దక్షిణాన ఒక్క కర్మాగారం లేక అప్పటికే వ్యతిరేకత మొదలు కావడంతో దీనిపై చర్చ నడిచింది.

Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి

ఇదీ ఉద్యమ ప్రస్థానం..

ఈ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేయాలని 1964లో అసెంబ్లీలో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో తీర్మానం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నాయకులు తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, పి.వెంకటేశ్వర్లు లాంటివారు కూడా మద్దతు ఇచ్చారు. అప్పుడు కేంద్ర మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉండడంతో ఆయనపైనా ఉమ్మడి ఏపీ నుంచి విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం పరిశీలనకు హిందూస్తాన్ స్టీల్స్ (అప్పటి)ను కోరగా పలు సంస్థలు కలిసి నివేదిక ఇచ్చాయి. వైజాగ్‌తో పాటు సేలం, గోవా, నైవేలీలను ప్రతిపాదించారు. విశాఖ ఓడరేవు కూడా కావడంతో సానుకూలత ఉంటుందని కమిటీ తేల్చింది. తరువాత కాలంలో కంపెనీ ఏర్పాటుకు ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చారు. అయితే 1966లో ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. తరవాత ప్రధాని అయిన ఇందిరాగాంధీ విశాఖతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డిమాండ్ వస్తోందని చెప్పడంతో ఏపీ ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

ఇందిర హయాంలో..

అదే సమయంలో సేలంలో కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం తమిళనాడు అసెంబ్లీలో ప్రకటించడంతో ఏపీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆగ్రహావేశాలకూ లోనయ్యారు. అదీ చాలదన్నట్లు.. నీలం సంజీవరెడ్డిని ఉక్కు శాఖ మంత్రిగా తప్పించిన ఇందిర..ఆయనకు పర్యాటక శాఖ అప్పగించారు. ఇది మరో సెంటిమెంట్‌కు కారణమైంది. ఇదే సమయంలో నీలం వర్సెస్ కాసు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా పెరిగింది. పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు జరిగాయి. రాజకీయ కారణాలతో విశాఖ ఉక్కు సాధ్యం కాదన్న చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో 1966 అక్టోబరు 15న గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. రోజురోజుకూ ఉద్యమం విస్తరించింది. అన్నివర్గాలూ మద్దతు తెలిపాయి.

Must Read ;- వాట్ ఏ జోక్.. విశాఖ ఉక్కుపై బీజేపీ పోరాటమట..!

విశాఖ ఉక్కు కోసం ఆదిలాబాద్‌లో ఆందోళన..కాల్పుల్లో ఒకరు బలి

1966 నవంబరు 1న జరిగిన ఘటన ఉద్యమాన్ని మలుపు తిప్పింది . ఆరోజున  ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పరస్పరం దాడులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో మొత్తం 9మంది చనిపోయారు. ముగ్గురు విద్యార్థులు, తొమ్మిదేళ్ల బాలుడు, మరోఐదుగురు ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఘటనతో ఉద్యమంపై హింసాత్మక ముద్ర వేసేందుకు కేంద్రం యత్నించడం మొదలు పెట్టిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆ క్రమంలో ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఉద్యమకారులు రైల్వే స్టేషన్లు, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడంతో వాటిని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు మొదయ్యాయి. పోలీసుల కాల్పులూ జరిగాయి. ఆ కాల్పుల్లో ఆదిలాబాద్, శ్రీకాకుళం, కాకినాడ, వరంగల్, సీలేరుల్లొ ఒకరు చొప్పున, గుంటూరు,  విజయవాడలో 5గురు చొప్పున, విజయనగరంలో ఇద్దరు చనిపోయారు. మొత్తం మీద 32మంది బలయ్యారు. ఉద్యమం అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్రం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో కంపెనీ ఏర్పాటు చేయాలని కోరేందుకు వెళ్లిన ఎంపీలపై ప్రధాని ఇందిర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పటి నాయకులు చెబుతుంటారు. మంత్రివర్గ ఉప సంఘం నియమించిందన్న ప్రకటనతో ఆందోళనకు తత్కాలికంగా తెరపడినా.. తరువాత కేంద్రం మళ్లీ మొదటికొచ్చింది. ఖనిజాల లభ్యతను బట్టి కర్మాగారం ఏర్పాటు అవుతుందని, ప్రజల్లో వచ్చే డిమాండ్‌ని బట్టి కాదని కేంద్రం ప్రకటించడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన 67మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు.

పార్లమెంటులో ప్రకటన

1967లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 167 ఎమ్మెల్యే సీట్లు గెలవగా 35 ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు 1970లో విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ఆధీనంలో ఆ కంపెనీ  పనిచేస్తుందని ప్రధాని ఇందిర పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చిన వెంటనే కురుపాం జమిందారులు 6వేల ఎకరాలు, మరికొందరు పారిశ్రామిక వేత్తలు 2వేల ఎకరాలను విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఇంత భూరి విరాళం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేసినా 1977లో పనులు మొదలయ్యాయి. సాంకేతికంగా రష్యా సహకారం తీసుకుని పనులు ప్రారంభించారు. అయితే నిధుల కొరత, సాంతికేక అంశాల కారణంగా దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1992లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమైంది. అంటే దాదాపు 20ఏళ్ల పోరాటమని చెప్పవచ్చు. ఇలా మొత్తం 26వేల ఎకరాల్లో, ఏటా 7.3మిలియన్ టన్నుల సామర్థ్యం, 16వేలమంది ఉద్యోగులు, 17,500మంది తత్కాలిక ఉద్యోగులు, మొత్తం మీద లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మాగారం. సొంత ఇనుప ఖనిజాలు లేకపోవడంతో ఖర్చులు పెరగడంతో నష్టాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తరచూ తలెత్తుతోంది. ఉత్పాదక నష్టాల్లేకపోగా ముడి ఇనుము కొనుగోలు, అప్పులపై వడ్డీల్లాంటివి కంపెనీకి భారంగా మారాయి.

Also Read ;- పెట్టుబడులు పెంచేందుకే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ: సుజనాచౌదరి

సొంతంగా గనులు లేని విశాఖ ఉక్కు..

దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు కర్మాగారం వైజాగ్ స్టీల్స్ అని చెప్పవచ్చు.ముడి ఇనుము, బొగ్గు కోసం,కోకింగ్ కోల్ బ్లాక్‌ల కోసం ఒడిషా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, బిస్రా స్టోన్ లైమ్ కంపెనీల నుంచి కొంటోంది. దీంతో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఏటా ఇందుకు రూ.3వేల కోట్ల అదనపు భారం పడుతోంది.  ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోగా తర్వాతి కాలంలో తేరుకొని రూ. 21,851 కోట్ల టర్నోవరు సాధించింది. 2003-2009 మధ్య కాలంలో రూ.వెయ్యికోట్ల లాభాలను సాధించింది. 2015-2018 మద్య ధరల పెరుగుదల కారణంగా నష్టాల్లోకి వెళ్లింది. 2018-19లో రూ.97 కోట్ల లాభం వచ్చింది. తరువాతి కాలంలో మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. ఇదే కారణంగా గతంలో పోస్కోను రంగంలోకి దింపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఆందోళనలు జరగడంతో కంపెనీతో మాట్లాది పోస్కోను వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోనే నిర్మించేందుకూ సిద్దమైంది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధం కావడంతో ఆందోళన మొదలైంది.

ఇక్కడ ఎలా..

కాగా 1990ల్లో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిచేందుకు అంతా సిద్ధమైంది. పనులు కూడా పూర్తయ్యాయి. గతంలో మూతపడిన కర్మాగారం స్థానంలోనే గ్యాస్‌ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ప్రభుత్వం మళ్లీ ఏర్పాటు చేసింది. నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్ఎల్‌), ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌), ఫర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎఫ్‌సీఐల్‌)ల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. అలాంటిది కొన్ని చర్యలు తీసుకుంటే లాభాల్లోకి వచ్చే విశాఖ ఉక్కును నష్టాలు వస్తున్నాయన్న కారణం చెప్పి.. ప్రైవేటు పరం చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 ఎన్నో ఆరోపణలు..

ఇక టీడీపీ నేత అయ్యనపాత్రుడు చేసిన వ్యాఖ్యలూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ.లక్ష కోట్లకుపైగా విలువ ఉన్న విశాఖ ఉక్కు కంపెనీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్ను పడిందని, అందుకే కుట్ర ప్రకారం ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇక పోస్కో కంపెనీ కూడా గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో ఎంటరయ్యేందుకు యత్నించిందన్న టాక్ కూడా గతంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యనపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అధికార, విపక్ష ఎంపీలు ప్రకటన చేశారు. కాగా విశాఖలో ఇప్పటికే ఉద్యమం మొదలైన నేపథ్యంలో 22మంది ఎంపీలున్న వైసీపీ కేంద్ర నిర్ణయాన్ని ఎంతవరకు అడ్డుకుంటుందో చూడాలి.

Tags: ap bjpap bjp politicsayyanna patrudu called all parties to save visaka steelbjp decision to sellbjp dual statements on visakha steel plantbjp protest on visakha steel plantcenter thinking for privatisationEditorspickleotopso many gave their lives to get visaka steelso many leaders fighted for thissomu veerajusteel plant for saletdp leader allegated vijaya sai behind thistelegu newstelugu newsvijaya sai plans to visaka steel propertiesvisaka steel aap people rightvisakha steel plantvisakha steel plant privatisationVisakhapatnam Steel PlantVisakhapatnam Steel Plant Latest NewsVisakhapatnam Steel Plant newsVisakhapatnam Steel Plant PrivateVizag SteelVizag Steel cityVizag Steel Latest NewsVizag Steel newsVizag Steel PlantVizag Steel Plant newswhat the ycp mps doingycp and bjp combined in this planycp sent wrong raport to central govt
Previous Post

అందాల దాడికి రెడీ అవుతున్న నజ్రియా నజీమ్

Next Post

రాజుకు సిపాయి ఎలా ‘చెక్’ చెప్పగలిగాడు?

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీక్రెట్‌ లీక్‌.. కనిపెట్టేసిన పోలీసులు..!!

ఎన్ని వచ్చినా.. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదీ ఇవ్వలేదు

మెగా మేనల్లుడి సరసన ఐశ్వర్యా…?

రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతారట!

సమంత, నందిని కలయికలో హారర్ థ్రిల్లర్

రెచ్చగొట్టిందెవరో.. ఆకుల వెంకటేష్ ఎప్పుడూ రచ్చే..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

రేణు దేశాయ్ పాన్ ఇండియా చిత్రం ‘ఆద్య’

ఒక్క రోజులో.. 5 సినిమాలతో దిల్ రాజు ఫుల్ బిజీ

స‌మంత‌కు అస్వ‌స్థ‌త‌. ఇంత‌కీ ఏమైంది..?

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist