రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. జట్టులో అందరూ కలిసి కట్టుగా రాణించి.. 189 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందుంచారు. అయితే.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే రాజస్థాన్ చేయగలిగింది. ఫలితంగా.. రాజస్థాన్ జట్టుపై 45 పరుగుల తేడాతో చెన్నై విక్టరీ నమోదు చేసుకుంది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్(49) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. సీఎస్కే స్పిన్నర్ మొయిన్ అలీ 3 వికెట్లు, సామ్ కరన్, జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టారు.

సమష్టి కృషితో..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. చేతన్ సకారియా 3/36 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, చెన్నై జట్టులో ఎవరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా తలా కొన్ని పరుగులు సాధించారు. సీఎస్కే బ్యాట్స్‌మెన్.. డుప్లెసిస్(33), మొయిన్ అలీ(26), అంబటి రాయుడు(27), సురేశ్ రైనా(18), ధోనీ(18), బ్రావో(20నాటౌట్; 8 బంతుల్లో 2×4, 1×6) ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో సకారియా 3, మోరిస్ 2, ముస్తాఫిజుర్ 1, రాహుల్ తెవాతియా 1 వికెట్ తీశారు.
Must Read ;- రాహుల్ చాహర్ మ్యాజిక్.. కోల్‌కతాపై ముంబయి విజయం











