టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజును సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకకు రావాలని దిల్ రాజు స్వయంగా వెళ్లి చాలా మంది హీరోలను, నిర్మాతలను, డైరెక్టర్స్ ను పిలిచారట. ఈ వేడుక కోసం స్పెషల్ గా ఇన్విటేషన్ కూడా చేయించారు. ఈ ఇన్విటేషన్ లో డిఆర్ 50 అంటే దిల్ రాజు 50 అనే లోగోను కూడా డిజైన్ చేయించారు. సమ్మర్ లో రెండో పెళ్ళి చేసుకున్న దిల్ రాజు పెళ్లికి ఇండస్ట్రీలో అందర్నీ పిలవాలి అనుకున్నారట కానీ.. కరోనా కారణంగా కుదరలేదు.
ఇప్పుడు పుట్టినరోజు రావడం.. అది 50వ పుట్టినరోజు కావడంతో ఇలా స్పెషల్ గా ప్లాన్ చేశారట. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ వలనే ఇంత హ్యాపీగా ఉన్నాను అని దిల్ రాజు చెప్పారు. ఈ ఫంక్షన్ కి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగచైతన్య, విజయ్ దేవరకొండ.. ఇలా మంది వచ్చారు. అయితే.. బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ, రానా… ఇలా కొందరు మాత్రమే రాలేదు.
కానీ టాప్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాలేదు. వీరిద్దరూ రాకపోవడం విచిత్రమే. అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన ఆర్య సినిమాని దిల్ రాజే నిర్మించారు. అలాగే అల్లు అర్జున్ తో పరుగు సినిమా కూడా చేసారు. అలా.. బన్నీతో మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో బృందావనం, రామయ్యా వస్తావయ్యా సినిమాలు నిర్మించారు. ఎన్టీఆర్ తో కూడా మంచి అనుబంధం ఉంది. అయినప్పటికీ.. వీరిద్దరూ రాలేదు. బన్నీ పుష్ప షూటింగ్ లో ఉండడం వలన రాలేదు అంటున్నారు. మరి.. ఎన్టీఆర్ ఎందుకు రాలేదో తెలియాల్సివుంది. మహేష్ బాబు ఈ పార్టీలో రాత్రి 1 గంట వరకు ఉన్నారని తెలిసింది.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ లో షాకింగ్ గెటప్ లో ఎన్టీఆర్