సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ టీజర్ లో రూపాయి కనిపించడం.. ఆసక్తిని కలిగించింది. దీంతో అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి.? అని ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఈ సినిమా ప్రారంభం కాక ముందు నుంచి బ్యాంకులో వందల కోట్లు లోను తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాంటి వాళ్లకు ఎలా బుద్ది చెప్పాడు అనేదే ఈ కథ అంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు ఈ కథ పై మరింత సమాచారం బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ మూవీ పోస్టర్ లో రూపాయి కనిపించింది. దీని వెనకే అసలు స్టోరీ ఉందట. ఈ కథలో హీరోకి ప్రతి రూపాయి లెక్కే అట. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఓ రోజు తన చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంటుందట. అప్పటి నుంచే ఆ రూపాయితోనే డబ్బులు సంపాదించాలనే లక్ష్యం ఏర్పడుతుందట. తల్లిదండ్రులు లేని హీరో కోట్లు కోట్లు సంపాదించాలనుకుంటాడట. అది కూడా న్యాయంగానే. అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుందట.
ఈ కథ వినగానే డబ్బే కథాంశంగా రూపొందిన చిరంజీవి ఛాలెంజ్ సినిమా, అలాగే రజనీకాంత్ శివాజీ సినిమా గుర్తొస్తాయి. అయితే.. పరశురామ్ ఆ సినిమాలు గుర్తురాకుండా డిఫరెంట్ స్ర్కీన్ ప్లే తో ఈ కథను రాసుకున్నాడట. డిఫరెంట్ గా ఉన్న స్ర్కీన్ ప్లే నచ్చే మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జనవరి నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా స్టార్ట్ కానుంది.
ఈ కథ గురించి వార్తలు వస్తుండడంతో… కథ వింటుంటేనే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇక తెర పై చూస్తే.. ఇంకెంత బాగుంటుందో అంటున్నారు అభిమానులు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు .. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న మహేష్ సర్కారు వారి పాటతో సంచలనం సృష్టిస్తాడని ఆశిద్దాం.
Must Read ;- ‘భీష్మ’ దర్శకుడితో సూపర్ స్టార్.. నిజమేనా?
https://www.youtube.com/watch?v=cAog2T82XF8











