సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జస్టీస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నాళ్లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ హైకోర్టు సమస్య పరిష్కారానికి నోచుకుంది. ఆయన చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. పెండింగ్ లో ఉన్న ఫైలును తీసి, ఆమోదం తెలిపారు. దీంతో న్యాయమూర్తుల సంఖ్య 75 శాతం పెరిగింది. హైకోర్టు కోరిక మేరకు, దేశవ్యాప్తంగా హైకోర్టులో ఉన్న ఖాళీల గురించి చర్చకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్వీరమణ ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఆమోదం తెలిపారు.
must read ;- విద్యార్థికి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ప్రత్యుత్తరం.. అదే ఆయన ఉన్నత వ్యక్తిత్వం











