టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ లో బాలయ్య, బోయపాటి సినిమా ఒకటి. ‘సింహా, లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న యన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని సినిమాను విడుదల చేయబోతున్నారు.
అయితే ఇప్పటికీ ఇంకా ఈ సినిమా టైటిల్ ను నిర్ణయించకపోవడంతో అభిమానులు బాగా అప్ సెట్ అయ్యారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన టైమ్ లోనే టైటిల్ ను రివీల్ చేసి ఉంటే బాగుండు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్నాళ్ళ వెయిటింగ్ కు తెరదీస్తూ.. మేకర్స్ .. ఈ సినిమా టైటిల్ రివిలేషన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. సరిగ్గా ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12:33 నిమిషాలకు టైటిల్ ప్రకటిస్తారని మేకర్స్ తెలియచేశారు. ట్విట్టర్ వేదిక గా ఈ విషయాన్ని ప్రకటించారు.
దాంతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ సినిమాకు ముందుగా మోనార్క్ అని ఆ తర్వాత.. టార్చ్ బేరర్, డేంజర్ , గాడ్ ఫాదర్ లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉండేవి. కానీ వీటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. దాంతో ఈ టైటిల్స్ అన్నీ ఒట్టి రూమర్సే అని అర్ధమైంది. అయితే దర్శకుడు బోయపాటి ఈ సినిమా కథాంశానికి సరిపోయేలా .. సంస్కృత టైటిల్ ను అనుకుంటున్నారని మొన్నా మధ్య వార్తలొచ్చాయి. జయజానకి నాయక, వినయ విధేయ రామ తరహాలో ఈ సినిమా టైటిల్ ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఉగాది రోజున బోయపాటి అండ్ టీమ్ .. నిర్ణయించే టైటిల్ అభిమానులకు ఎలాంటి అనుభూతినివ్వబోతుందో చూడాలి.
Must Read ;- బాలయ్య, బోయపాటి సినిమాకి సంస్కృత టైటిలా?
We know how long you have been waiting..
The much awaited #BB3TitleRoar to be revealed on this Ugadi💥13th April at 12:33PM.#BB3RoarOnMay28th #BalayyaBoyapati3#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/grcqRt1402— Dwaraka Creations (@dwarakacreation) April 11, 2021