రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ జూలై 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రీకరణ ను వేగవంతం చేశారు మేకర్స్. దీంతో పాటు ప్రభాస్ మరో మూడు పాన్ ఇండియా మూవీస్ ను వరుసగా లైన్ లో పెట్టుకున్నాడు. ప్రశాంత్ నీల్ యాక్షన్ మూవీ సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ చిత్రాలు రెండూ.. ప్రస్తుతం చిత్రీకరరణ జరుపుకుంటున్నాయి. ఇందులో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేసేస్తోంది. అదేంటంటే.. ఆదిపురుష్ మేకర్స్.. శ్రీరామనవమి స్పెషల్ లుక్ విడుదల చేయబోతోందట. ఆ రోజున శ్రీరాముడి పట్టాభిషేకం జరిగే ఘట్టానికి సంబంధించిన లుక్ విడుదల అవుతుందట. అందులో శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవి గా కృతి సనన్ ఆకట్టుకోబోతున్నారట. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రూపొందుతోంది కాబట్టి.. దేశం మొత్తం ఈ సినిమాపై చాలా ఆసక్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఈ లుక్ విడుదలైన తర్వాత సినిమాకి మరింత క్రేజ్ వచ్చే అవకాశముంది. మరి శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా ఉండబోతాడో చూడాలి.
Must Read ;- క్రేజీ తమిళ దర్శకుడితో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా?