వెరైటీ పాత్రల్ని వెతికి పట్టుకోవడంలో దిట్ట కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి. విలన్ అయినా, హీరో అయినా.. ప్రధాన పాత్ర అయినా , ప్రత్యేక పాత్ర అయినా.. ఏదైనా సరే అందులోని క్వాలిటీకే అతడు మొదటి ప్రాధాన్యతనిస్తాడు. అందుకే అతడ్ని అన్ని భాషల నుంచి ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు, మలయాళ చిత్రాల్లో సైతం అద్భుతమైన పాత్రల్ని పోషించిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు బాలీవుడ్ లో కి కూడా అడుగుపెడుతున్నాడు. అందులోనూ కరీనా కపూర్ ప్రాధాన పాత్ర పోషిస్తున్న సినిమాతో. ఆ మూవీ పేరు మేరీ క్రిస్మస్.
అంధాధున్ సూపర్ హిట్ మూవీని రూపొందించిన శ్రీరామ్ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న మేరీ క్రిస్మస్ షూటింగ్ ఆ పాటికి గోవాలో మొదలు కావాలి. అయితే కరీనాకి కరోనా కారణం గా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇందులో విజయ్ సేతుపతి పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందట. యాక్టింగ్ కు బాగా స్కోపున్న ఈ పాత్రను అతడు ఛాలెంజింగ్ తీసుకున్నాడట. వచ్చేనెల్లో గోవాలో విజయ్ సేతుపతి, కరీనా మీద కొన్ని ప్రత్యేక సన్నివేశాల్ని .. తక్కువ సిబ్బందితో చిత్రీకరించబోతున్నారట. మరి మేరీ క్రిస్మస్ విజయ్ సేతుపతికి ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఫస్ట్ లుక్ : విజయ్ సేతుపతి – వెట్రిమారన్ ‘విడుదలై’










