కరోనా వ్యాక్సిన్ సరళీకృత మరియు వేగవంతమైన దశ 3 గా దీనిని చెబుతున్నారు. ముందు మెడికల్, పోలీస్ లాంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వగా తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చారు. తరువాత 45 ఏళ్ళ వారికి ఇచ్చారు. అయితే కరోన కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిన్చేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న అనేక ముఖ్యమైన నిర్ణయాలలో ఇది కూడా ఒకటి. దీంతో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యాక్సిన్ తయారీదారులు తమ సరఫరాలో 50% వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధం అయితే మిగతాది ఓపెన్ మార్కెట్ లో ముందే నిర్ణయించిన రేటుకు అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.
Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్