తమిళ నటుడు ఆర్.మాధవన్ స్వీయ దర్వకత్వంలో నిర్మించిన సైంటిఫిక్ బయోపిక్ ‘రాకెట్రీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పై దేశ వ్యాప్తంగా చర్చించుకున్నారు. ది నంబీ ఎఫెక్ట్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమా.. ఎవరి బయోపిక్ ? అసలు ఎవరీ నంబీ అని ఆయన గురించి అందరూ గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. రాకెట్ సైంటిస్ట్ గా దేశానికి ఎనలేని సేవ చేసిన నంబినారాయణ్ బయోపిక్ గా రూపొందిన సినిమా ‘రాకెట్రీ’.
ఇస్రోలో సైంటిస్ట్ గా అనేక ప్రయోగాల్లో భాగస్వామిగా ఉన్నారు నంబీ నారాయణ్. ఆయన మేథాశక్తికి విదేశాల నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆయన వాటన్నిటీ కాదని.. తన మాతృదేశానికే తన మేథాశక్తిని ధారబోయాలని తపించారు. అలాంటి ఆ మహామనిషిని దేశ ద్రోహం కేసులో ఇరికించారు కొందరు స్వార్ధపరులు. అందుకే అలాంటి దేశభక్తుడి జీవిత కథపై రూపొందిన సినిమా ట్రైలర్ పై ప్రధాని నరేంద్ర మోడి ఎంతో ఆసక్తి చూపించారు.
ఇటీవల నంబీ నారాయణ, ఆయన పాత్రను తెరపై పోషించిన మాధవన్ నరేంద్ర మోడిని కలిసి .. తమ సినిమా ట్రైలర్ ను వీక్షించడానికి ఆహ్వానించారు. నంబీ నారాయణ్ .. మాధవన్ ను పరిచయం చేసి.. తన జీవిత కథను సినిమాగా మలిచి తెరమీద ఆవిష్కరించిన దర్శకుడిగా మాధవన్ ను పరిచయం చేశారట. ప్రధాని ఈ ట్రైలర్ ను వీక్షించి మాధవన్ ను ప్రశంసించడమే కాకుండా.. సినిమాను కూడా తప్పకుండా చూస్తానని చెప్పారట. దేశద్రోహం కేసు నుంచి బైట పడడమే కాకుండా.. అలాంటి మేధావిని ఇరికించినందుకు నష్టపరిహారంగా రూ. 50లక్షలు కూడా చెల్లించమని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించిందట. అందుకే అలాంటి మహా మనిషి కథను అందరికీ తెలిసే ఉద్దేశంతో మాధవన్ ఈ సినిమాను రూపొందించాడట. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
Must Read ;- సైనా నెహ్వాల్ బయోపిక్ .. రిలీజ్ డేట్ ఫిక్స్డ్
R Madhavan meets PM Modi, ISRO scientist Nambi Narayanan to discuss Rocketry: The Nambi Effect | Celebrities News – India TV🙏🙏❤️❤️🚀🚀🇮🇳🇮🇳 https://t.co/J0OSRTvcRZ
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 5, 2021











