కరోనా విలయతాండవంతో ఓ వైపు దేశం అతలాకుతలం అవుతుండగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో దేశంలో మరింత ఆందోళన మరింత పెరిగింది.అది చాలదన్నట్లు నిన్నటికి నిన్న వైట్ ఫంగస్ వ్యాధి బయటకు రావడం తాజాగా ఎల్లో ఫంగస్ వార్తలు కలకలం రేపుతున్నాయి.తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఎల్లో ఫంగస్ కేసు బయటపడింది.ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.కాగా ఎల్లో ఫంగస్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్ కంటే ఎల్లో ఫంగస్ మరింత ప్రమాదకారి అని కొందరు వైద్యులు చెబుతుండగా ఇప్పుడే అదేం చెప్పలేమని,మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు.ఇక యూపీలో సంజయ్ నగర్‌కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఎల్లో ఫంగస్‌ను గుర్తించినట్లు హర్ష ఈఎన్టీ డాక్టర్ బీపీ త్యాగి తెలపడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిపుణులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

లక్షణాలు ఇవీ..
ప్రాథమిక సమాచారం మేరకు గుర్తించదగిన ఎల్లో ఫంగస్‌కి సంబంధించి పలు లక్షణాలను వైద్యులు చెబుతున్నారు. నిస్సత్తువ,బద్దకం,బరువు తగ్గడం,తక్కువ ఆకలి లేదా ఆకలి లేకపోవడంతోపాటు గాయాలున్న సందర్భంలో గాయాలు మరింత పెద్దవి కావడం,చీము కారడం వంటి లక్షణాలు ఉంటాయి.ఈ ఫంగస్ వస్తే కంటి చూపుపై ప్రభావం పడుతుందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే తీవ్ర ప్రభావం చూపుతుందని,కొన్ని సార్లు అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుందని,అంతర్గతంగానే ఇదంతా జరుగుతున్నందున ప్రాణాంతక పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.కాగా వైద్యుల సూచనతో,ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు ఇతర పరీక్షలు చేయించుకున్నతరువాత పరిస్థితిని బటి యాంటీ-ఫంగల్ డ్రగ్ ఆంఫోటెరిసిన్-బి వినియోగిస్తారని,అయితే కచ్చితమైన డోసేజ్ మాత్రమే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు.
ఎందుకొస్తుందంటే..
కాగా ఎల్లో ఫంగస్ ఎలా వస్తుందనే అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలున్నాయి.ప్రాథమిక వివరాల మేరకు నిల్వనీరు ఉన్న చోట్ల ఇతర జీవుల వ్యర్థాలు,బూజులాంటివి,ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం తినడం,అపరిశుభ్ర వాతావరణంలో నీరు-ఆహారం తీసుకోవడం,మలం నుంచి కూడా వ్యాప్తికి వ్యాపిస్తుందని చెబుతున్నారు.తేమ ఎక్కువగా ఉండి,గాలి వెలుతురు తక్కువగా ఉన్నచోట్ల ఈ ఫంగస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
మార్గాలు ఇవే..
కొవిడ్,బ్లాక్ ఫంగస్,వైట్ ఫంగస్,ఎల్లో ఫంగస్ ..ఇలా ఎన్ని వైరస్‌లు ఉన్నా వాటి బారిన పడకుండా ఉండాలన్నా,అవి వచ్చినా కోలుకోవాలన్నా ముందు జాగ్రత్త చర్యలు ఒకటేనని వైద్యులు చెబుతున్నారు.రోగనిరోధక శక్తి పెంచుకోవడం, కనీస వ్యాయామం,వ్యక్తిగత,సామాజిక పరిశుభ్రత పాటించడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.ఇంటి వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం,నీరు నిల్వ ఉండే ప్రాంతాలను శుభ్రం చేసుకోవడం,గాలి-వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవడం,రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారం తీసుకోవడం,నిల్వ ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం అవసరం.ఈ వ్యాధి బారిన పడిత కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అవసరం ఉంటుంది.
Must Read ;- వుహాన్ ల్యాబ్ నుంచే కొవిడ్-19.. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం











