(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రజారోగ్యం కోసం సింహగిరిపై సోమవారం శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం,స్వాతి నక్షత్ర హోమం,సుదర్శన మంత్ర పఠనం నిర్వహించారు.కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామికి పూజలు ప్రత్యేక పూజలు చేశారు.సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధన్వంతరి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.తెల్లవారుజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక ఆరాధన అనంతరం..గంగధార నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.అనంతరం ఆలయం పక్కనే ఉన్నయాగశాలలో తొలుత స్వాతి నక్షత్ర హోమం పూజలు,ఆ తర్వాత ధన్వంతరి హోమం,సుదర్శన యాగం నిర్వహించారు.ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని,ప్రజలు మెరుగైన ఆరోగ్యం పొందాలని ఈ ధన్వoతరి హోమం నిర్వహించినట్లు ధర్మకర్త సంచైత గజపతిరాజు,ఆలయ ఈఓ సూర్యకళ తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలను కరోనా భయం వెంటాడుతోందని,ఇటువంటి సమయంలో ధన్వంతరి హోమం నిర్వహించినట్టు అయితే భయాలతోపాటు వ్యాధులు,రుగ్మతలు పూర్తిగా తొలగి పోతాయని భావించి ఈ హోమం నిర్వహించామని స్థానాచార్యులు రాజగోపాల్ చెప్పారు.గతంలో కంచితో పాటు అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఇబ్బందులు సంభవించినప్పుడు ఈ తరహాలోనే అక్కడ ధన్వoతరి హోమంతో పాటు అష్టకమ్ పఠనం చెయ్యడంతో ఆ ప్రాంతంలో వ్యాధులు,భయాలు మటుమాయం అయ్యాయన్నారు.దేవ వైద్యులైన ధన్వంతుడ్నిపూజిస్తే సర్వ రోగాలు హరించుకు పోతాయని..త్వరలోనే కరోనా నుంచి సురక్షితంగా ప్రజలు బయట పడతారని రాజగోపాల్ వివరించారు.కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమచార్యులు,పురోహితులు కరి సీతారామాచార్యులు పాల్గొన్నారు.
Must Read ;- కరోనాకు తోడు మరిన్ని.. యూపీలో ఎల్లో ఫంగస్ కేసు











