Covid Effect on Old News Papers :
మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్ ఉందా… అయితే ఫ్రీగా ఎవరికీ ఇవ్వకండి. ‘న్యూస్ పేపర్ కదా.. ఇస్తే పొయేదేమీ ఉందిలే’ అని అంటారా. అయితే అసలు విషయం తెలిస్తే న్యూస్ పేపర్ ను ఎవరికి ఫ్రీగా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో న్యూస్ పేపర్ కు బాగా డిమాండ్ ఉంది. కరోనా కారణంగా పేపర్స్ నిల్వలు లేకపోవడం, ఉత్పత్తి కూడా తగ్గడంతో ధరలు అమాంతగా పెరిగిపోయాయి. గతంలో కిలో రూ. పది రూపాయల వరకు మాత్రమే ఉండేది. కరోనా నేపథ్యంలో పేపర్ మార్కెట్లోకి రాకపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగింది. వ్యాపారులు రూ. 35 రూపాయలకు అమ్ముతున్నారు. పాత పేపర్లు దొరక్కకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను కొన్నాడు. గుజరాత్ నుంచి తెప్పించుకున్న పాత పేపర్లను నిజమాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోని చిరు వ్యాపారులకు అమ్మారు. మీ దగ్గర పాత పేపర్లు, గుట్టలుగుట్టలుగా ఉంటే వెంటనే అమ్మేయండి మరి.
Must Read ;- జర జాగ్రత్త.. టీకా తీసుకున్నా కరోనా వస్తుంది : శ్రీనివాస్